Kamareddy Police Sports | క్రీడల్లో సత్తా చాటిన కామారెడ్డి పోలీసులు

వరంగల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో కామారెడ్డి జిల్లా పోలీసు సిబ్బంది అద్భుత ప్రతిభ కనబరిచారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Police Sports | వరంగల్‌లో నిర్వహించిన తెలంగాణ 5వ రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో  జిల్లా పోలీసు సిబ్బంది అద్భుత ప్రతిభ కనబరిచారు. మొత్తంగా ఒక స్వర్ణం, ఎనిమిది కాంస్య పతకాలు సాధించి జిల్లా పోలీస్ శాఖకు గుర్తింపు తీసుకువచ్చారు.

Kamareddy Police Sports | ఎస్పీ అభినందన

పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా పోలీస్ కార్యాలయానికి ఆహ్వానించిన ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) వారిని ప్రత్యేకంగా అభినందించారు. బ్యాడ్మింటన్‌లో భిక్కనూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన బి. లక్ష్మి మహిళల 40 ప్లస్ సింగిల్స్ విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. డీఏఆర్ కామారెడ్డికి చెందిన ఎల్. బాబాగౌడ్, బి. లక్ష్మి 40 ప్లస్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించారు. ఖోఖోలో బీర్కూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన డి. బుజ్జి కాంస్య పతకం సాధించారు. హ్యాండ్‌బాల్‌లో డీఏఆర్ కామారెడ్డికి చెందిన ఎం. రేఖ, జి. శోభ, పిట్లం పోలీస్ స్టేషన్‌కు చెందిన కె. ప్రియాంక, బీర్కూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన బి. సవితారాణి, పెద్దకొడప్‌గల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఛి. వాసవి కాంస్య పతకాలు సాధించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ విధులు నిర్వహిస్తూనే క్రీడల పట్ల ఆసక్తి, అంకితభావంతో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు.

Kamareddy Police Sports | ఉద్యోగ బాధ్యతలతో పాటు..

ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ క్రీడల్లోనూ ప్రతిభ చాటుకోవడం వారి పట్టుదలకు, కృషికి నిదర్శనమని ఎస్పీ అన్నారు. వీరి విజయాలు ఇతర మహిళా పోలీసు సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. భవిష్యత్తులో జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని మరిన్ని పతకాలు సాధిస్తూ కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పతకాలు సాధించిన క్రీడాకారులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరసింహ రెడ్డి, డీఎస్పీలు గటుమాల్, ఉదయ భాస్కర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ సంపత్, ఆర్‌ఐలు సంతోష్ కుమార్, నవీన్  పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: National Turmeric Board | పసుపు రైతుల అభ్యున్నతే లక్ష్యంగా జాతీయ పసుపు బోర్డు కృషి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *