అక్షరటుడే, ఆర్మూర్ : Armoor High Tension | ఆర్మూర్ పట్టణంలో సోమవారం హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రెండు రోజుల క్రితం పట్టణంలోని భరత్ చంద్ర పాఠశాలలో హిందూ విద్యార్థులకు ఉర్దూ, నమాజ్ నేర్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బీజేపీ నాయకులు పాఠశాలలో ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే.ఎంఐఎం ఆధ్వర్యంలో పలువురు ఆదివారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన నిర్వహించారు.
ఈ క్రమంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం భారీ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. దీంతో పట్టణంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళన కార్యక్రమాల నేపథ్యంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్య నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Armoor High Tension | పోలీసులతో ఎమ్మెల్యే వాగ్వాదం
ఆర్మూర్‌లో (Armoor High Tension ) చేపడుతున్న హిందూ సంఘాల ర్యాలీకి మద్దతుగా హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి (MLA Rakesh Reddy) బయలు దేరారు. భిక్కనూరు టోల్గేట్ వద్ద ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పోలీసులతో వాగ్వాదం చేశారు. తను ఆర్మూర్ వెళ్లి తీరాల్సిందేనని లేనిపక్షంలో ఇక్కడే రోడ్డుపై కూర్చుంటానని పేర్కొన్నారు. ఆర్మూర్ భరత్ చంద్ర పాఠశాలలో హిందు విద్యార్థులకు తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఉర్దూ, నమాజ్ నేర్పడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మసీదులకు, మదర్సాలకు వెళ్లి భవద్గీత, గాయత్రి మంత్రాలు నేర్పడం లేదని, మరి వారు ఇలాంటి చర్యలకు దిగడం ఎంతవరకు సమంజసమన్నారు. అప్పుగా ఇచ్చిన డబ్బులు అడిగితే ఆర్మూరు మండలంలో పిప్రి గ్రామంలో ఇల్లు తగలపెట్టడంపై మండిపడ్డడారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని, అలాంటి వారికి పోలీసులు బాసటగా నిలవొద్దని ఆయన సూచించారు.
#BreakingNews | ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆర్మూర్ పట్టణంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసనకు పిలుపునివ్వడంతో భారీగా పోలీసులు మోహరించారు. నిరసనకు వస్తున్న ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డిని పోలీసులు భిక్కనూరు వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన… pic.twitter.com/zuc0hNDJIF
— Akshara Today | Telugu News (@aksharatoday) June 29, 2026
ఇది కూడా చదవండి..: Kasturba Negligence | కస్తుర్బాలో విద్యార్థినులు ఆర్తనాదాలు.. ఇన్‌ఛార్జి నిర్లక్ష్యంపై వెల్లువెత్తుతున్న నిరసనలు