AP Government Savings Measures|పొదుపు చర్యలపై ముందు ప్రజలను సిద్ధం చేద్దాం.. ఆపై అమలు చేద్దాం:పవన్ కల్యాణ్

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:AP Government Savings Measures|రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదలచుకున్న పొదుపు చర్యలు ప్రజలను ఇబ్బంది పెట్టేలా లేదా భయపెట్టేలా ఉండకూడదని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా ప్రజలకు ముందే తెలిసేలా ఉండాలని, కనీసం 48 గంటల ముందే వారికి సమాచారం ఇచ్చి మానసికంగా సిద్ధం చేయాలని సూచించారు. పవన్ సూచనలకు సానుకూలంగా స్పందించిన సీఎం, భవిష్యత్తులో ఇదే విధానాన్ని అనుసరిస్తామని హామీ ఇచ్చారు.

AP Government Savings Measures|పొదుపు చర్యలపై అధ్యయనం ..

ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో అనవసర ఖర్చులను తగ్గించేందుకు మంత్రుల కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యంగా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (ఇంటి నుంచే పని) విధానం వల్ల కలిగే ప్రయోజనాలు, దాని అమలు సాధ్యాసాధ్యాలపై సమగ్రంగా అధ్యయనం చేసి ఒక కార్యాచరణను రూపొందించాలని సూచించారు. దీనివల్ల ఇంధన ఆదాతో పాటు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

AP Government Savings Measures|సీమ, ప్రకాశం జిల్లాలకు లక్ష కోట్ల ప్యాకేజీ..

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేబినెట్ పెద్దపీట వేసింది. రాయలసీమ , ప్రకాశం జిల్లాల్లో ఉద్యానవన పంటలను (Horticulture) భారీగా ప్రోత్సహించేందుకు ‘ఇంటిగ్రేటెడ్ హార్టీకల్చర్ డెవలప్మెంట్ ప్లాన్’కు ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద రాబోయే కాలంలో లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనివల్ల ఆయా జిల్లాల్లోని రైతుల ఆదాయం పెరగడంతో పాటు వ్యవసాయ రంగం మరింత బలోపేతం కానుంది.

AP Government Savings Measures|ఆదర్శంగా నిలుస్తున్న సీఎం, డిప్యూటీ సీఎం..

పొదుపు మంత్రాన్ని మాటల్లోనే కాకుండా చేతల్లో చూపించాలని ఏపీ పాలకులు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను 12 నుంచి 4కు తగ్గించుకున్నారు. బుధవారం ఆయన ఎటువంటి ఆర్భాటం లేకుండానే సచివాలయానికి వెళ్లారు. అదేవిధంగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా తన కాన్వాయ్‌ను 3 వాహనాలకే పరిమితం చేయగా, మంత్రి లోకేష్ తన కాన్వాయ్‌ను 2 వాహనాలకు కుదించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు.

ఇది కూడా చదవండి: LPG Ships | హర్ముజ్​ను దాటిన రెండు ఎల్​పీజీ నౌకలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *