అక్షరటుడే, వెబ్డెస్క్: Missing Girl Jaanu | కాకినాడ జిల్లా (Kakinada District) తుని మండలంలో చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) ఆచూకీ దొరకడం లేదు. పాప కనిపించకుండా పోయి వారం అవుతున్నా.. ఆమె జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు అల్లాడుతున్నారు.
కాకినాడ జిల్లా తుని మండలం (Tuni Mandal) దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారం సమీపంలో యాభై ఎకరాల పామాయిల్ తోట ఉంది. ఈ తోటలో గణేష్, భవాని దంపతులు కాపలాదారులుగా పనిచేస్తున్నారు. కుమార్తె జానుతో కలిసి అక్కడే ఉంటున్నారు. అయితే గత శనివారం పెంపుడు కుక్కతో కలిసి రెండేళ్ల జాను ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అప్పటి నుంచి ఆమె ఆచుకీ దొరకడం లేదు.
Missing Girl Jaanu | అధికారులు గాలింపు
కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తోటలో గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పామాయిల్ తోట పక్కనే అడవి ఉండటంతో పోలీసులు, ఫారెస్ట్ అధికారులు, గ్రామస్తులు పాప కోసం వారం రోజులుగా గాలిస్తున్నారు. అయినా ఆచూకీ లభించలేదు. అయితే పాపతో వెళ్లిన కుక్క ఇటీవల తిరిగి వచ్చింది.
Missing Girl Jaanu |జీపీఎస్ ట్రాకర్ అమర్చి..
పాప ఎక్కడుందో కుక్కకు తెలిసి ఉంటుందని పోలీసులు భావించారు. అయితే కుక్కను వదిలితే అది ప్రజలను చూసి భయపడింది. దీంతో దానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి వదిలి పెట్టారు. ఆ కుక్క తిరిగి వచ్చింది. అది తిరిగిన మార్గంలో గాలించినా.. జాను జాడ మాత్రం లభించలేదు. 25 మంది SDRF సిబ్బంది, 10 మంది ప్రత్యేక బృందం సభ్యులు, ఏడుగురు సీఐలు (CIs), పలువురు ఎస్ఐలు (SIs), ఇతర పోలీసు సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది మరియు స్థానిక గ్రామస్తులు – ఇలా మొత్తం సుమారు 100 మంది జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. డ్రోన్లతో సైతం అడవిని జల్లెడ పడుతున్నారు. తమ కూతురు ఎలా ఉందోనని తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. అయితే పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారేమోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..:Revanth Reddy | పవన్ కల్యాణ్ తెలంగాణలో పోటీ చేయొచ్చు : సీఎం రేవంత్రెడ్డి
