అక్షరటుడే వెబ్‌డెస్క్: Gym Trainer Harassment | శిక్షణ పేరుతో జిమ్‌కు వచ్చే మహిళా పైలట్‌ను లైంగికంగా వేధిస్తూ, ఆమెను లోబరుచుకోవాలని ప్రయత్నించిన ఓ జిమ్ ట్రైనర్ ఉదంతం సనత్‌నగర్‌లో కలకలం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంతోష్ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Gym Trainer Harassment | గర్ల్‌ఫ్రెండ్‌తో పథకం..
సనత్‌నగర్‌లోని ఒక ప్రముఖ ‘కల్ట్’ (Cult) జిమ్‌లో బాధితురాలైన మహిళా పైలట్ మెంబర్‌షిప్ తీసుకున్నారు. ఆ జిమ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తున్న సంతోష్ గౌడ్, ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు. తన గర్ల్‌ఫ్రెండ్ రజినీతో కలిసి పథకం వేసిన సంతోష్, ఆమెను ప్రలోభాలకు గురిచేయాలని ప్రయత్నించాడు.
Gym Trainer Harassment |వేధింపుల పర్వం..
“మా ఇద్దరితో కలిసి ప్రైవేట్‌గా గడపాలి.. నాతో ఒక రాత్రి గడుపుతావా?” అంటూ నిందితుడు సంతోష్ గౌడ్ ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. అతడి నీచమైన ప్రతిపాదనను బాధితురాలు తీవ్రంగా వ్యతిరేకించింది. అయినప్పటికీ వెనక్కి తగ్గని నిందితుడు, ఆమెను మానసికంగా వేధిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడం మొదలుపెట్టాడు.
Gym Trainer Harassment | పోలీసుల చర్యలు..
ట్రైనర్ వేధింపులు భరించలేని బాధితురాలు సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు సంతోష్ గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ వేధింపులలో అతడికి సహకరించిన గర్ల్‌ఫ్రెండ్ రజినీ పాత్రపై కూడా పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
‘నాతో ఒక రాత్రి గడుపుతావా?’
ఈ మేరకు.. మహిళా పైలట్‌ని వేధింపులకు గురి చేసిన జిమ్ ట్రైనర్
హైదరాబాద్‌లోని సనత్ నగర్‌లో వెలుగు చూసిన సంచలన ఘటన
స్థానికంగా ఉన్న Cult జిమ్‌లో మెంబర్‌షిప్ తీసుకున్న మహిళా పైలట్
జిమ్ ట్రైనింగ్ పేరుతో ఆమెని లోబరుకునేందుకు ట్రైనర్ సంతోష్ గౌడ్ ప్రయత్నం… pic.twitter.com/9qgLg5nl6f
— PulseNewsBreaking (@pulsenewsbreak) June 13, 2026
ఇది కూడా చదవండి: Road Accidents Telangana | నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
