అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KA Paul Allegations | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ కూటమి నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. తాను ప్రపంచ శాంతి కోసం పోరాడుతుంటే.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ తన చారిటీ ఆస్తులను దోచుకోవడానికి పోరాటం చేస్తున్నారని పాల్ ఆరోపించారు.
KA Paul Allegations | పోరాటం ఆపను
తన ఆస్తులను దోచుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. తనపై జరుగుతున్న పరిణామాల వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రజలు నిజాలు గుర్తించాలని కేఏ పాల్ కోరారు. ప్రశ్నించకుండా తన నోరు మూయించాలని చూస్తున్నారని విమర్శించారు. తాను పోరాటం ఆపనని స్పష్టం చేశారు. తనకు న్యాయం చేయాలని ప్రధాని మోదీ, సుప్రీంకోర్టును కోరారు.
కూటమి నేతలపై కేఏ పాల్ సంచలన ఆరోపణలు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ కూటమి నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రపంచ శాంతి కోసం నేను పోరాటం చేస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లు తన చారిటీ ఆస్తులను దోచుకోవడానికి పోరాటం… pic.twitter.com/k0WGkQk0xI
— Akshara Today | Telugu News (@aksharatoday) June 13, 2026
దీనిని కూడా చదవండి : Missing Girl Jaanu | కుక్కకు జీపీఎస్ ట్రాకర్ పెట్టినా.. దొరకని జాను ఆచూకీ