అక్షరటుడే, ఎల్లారెడ్డి: Kalabhairava Temple Development | నియోజకవర్గ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి కేంద్రబిందువుగా నిలిచిన కాలభైరవ స్వామి దేవస్థాన అభివృద్ధిపై(Kalabhairava Temple) ఎమ్మెల్యే మదన్ మోహన్(MLA Madan Mohan) ప్రత్యేక దృష్టి సారించారు. ఆలయ కమిటీ సభ్యులతో శుక్రవారం సమీక్ష నిర్వహించి భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు.
Kalabhairava Temple Development | ఆలయ పరిసరాల అభివృద్ధి..
ఆలయ పరిసరాల అభివృద్ధి, రహదారులు, తాగునీటి సౌకర్యం, లైటింగ్, పార్కింగ్, మరుగుదొడ్లు, భక్తుల భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే అధికారులను సూచించారు. దేవస్థాన అభివృద్ధి పనుల్లో ఛైర్మన్, డైరెక్టర్లు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, ప్రతి ఉత్సవం, పూజా కార్యక్రమంలో కమిటీ సభ్యులంతా చురుకుగా పాల్గొనాలని స్పష్టం చేశారు.
Kalabhairava Temple Development | నిధుల సమీకరణకు..
దేవస్థాన నిధుల (Temple funds) సమీకరణను బలోపేతం చేసేందుకు గతంలో విరాళాలు అందించిన దాతలను తిరిగి సంప్రదించాలని ఎమ్మెల్యే సూచించారు. ఛైర్మన్ స్వయంగా ముందుండి విరాళాలు అందించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. దాతలతో ప్రత్యక్షంగా సమావేశమై ఆలయంలో జరుగుతున్న ధార్మిక, సేవా కార్యక్రమాలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వివరించాలని తెలిపారు. ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలు, ఉత్సవాలపై ఫ్లెక్సీలు, బ్యానర్లు, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ప్రముఖులు, సినీ, రాజకీయ నాయకులు ఆలయాన్ని సందర్శించినప్పుడు గౌరవప్రదంగా స్వాగతం పలికి వారి దర్శనాలను ప్రచారం చేయాలన్నారు.
Kalabhairava Temple Development | దేవస్థాన వాస్తు సంబంధిత అంశాలపై..
దేవస్థాన వాస్తు సంబంధిత అంశాలపై చర్చించిన ఎమ్మెల్యే, అవసరమైతే ఆలయ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న కొన్ని కుటుంబాలకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. దేవస్థాన అభివృద్ధి పనుల అమలులో ఈవో సహకారం తగిన స్థాయిలో లేదని కమిటీ సభ్యులు అభిప్రాయపడగా, అవసరమైతే ఈవో మార్పును పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఆలయ అధికారిక వెబ్‌సైట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, డొమైన్, హోస్టింగ్ కోసం దాతలు సహకరించాలని కోరారు. దేవాలయ ఆదాయం, ఖర్చులు, విరాళాల వినియోగంలో పూర్తి పారదర్శకత ఉండాలని, ప్రతినెల ఆర్థిక నివేదికను కమిటీ ముందు ఉంచాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రతినెల కమిటీ సమావేశం నిర్వహించి పనుల పురోగతిని సమీక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో దేవస్థాన ఛైర్మన్, టెంపుల్ కమిటీ డైరెక్టర్లు, రామారెడ్డి, ఇస్సనపల్లి సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Malkajgiri CP Sumathi | డ్రగ్స్ కట్టడికి డ్రోన్లతో నిఘా.. మల్కాజ్గిరి సీపీ సుమతి

