హైదరాబాద్Malkajgiri CP Sumathi | డ్రగ్స్​ కట్టడికి డ్రోన్​లతో నిఘా.. మల్కాజ్​గిరి సీపీ సుమతి

Malkajgiri CP Sumathi | డ్రగ్స్​ కట్టడికి డ్రోన్​లతో నిఘా.. మల్కాజ్​గిరి సీపీ సుమతి

మల్కాజ్​గిరి కమిషరేట్​ పరిధిలో విద్యార్థులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో డ్రగ్స్​ నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు సీపీ సుమతి తెలిపారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Malkajgiri CP Sumathi | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో డ్రగ్స్​ దందా జోరుగా సాగుతోంది. విద్యార్థులు, యువత గంజాయి, డ్రగ్స్​కు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మల్కాజ్​గిరి సీపీ సుమతి కీలక చర్యలు చేపట్టారు. డ్రగ్స్​ నివారణకు హాస్టళ్లపై డ్రోన్​లతో పెడతామని తెలిపారు.

మల్కాజ్​గిరి కమిషరేట్​ పరిధిలో విద్యార్థులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు డ్రగ్స్​ నిరోధక వ్యూహాన్ని ముమ్మరం చేశారు. దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్‌ (LB Nagar)లోని హాస్టళ్లపై డ్రోన్​లతో తనిఖీలు చేశారు. విద్యార్థులకు అక్కడికక్కడే డ్రగ్ టెస్టులు చేశారు. సీపీ సుమతి శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా నిరోధించడానికి మరియు విద్యాసంస్థలు, హాస్టళ్ల చుట్టూ పనిచేస్తున్న స్థానిక మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌లను నిర్మూలించడానికి సాంకేతికత ఆధారిత పోలీసింగ్‌ను అవలంభిస్తున్నారని సీపీ తెలిపారు.

Malkajgiri CP Sumathi | తక్షణ డ్రగ్ టెస్టులు

అర్ధరాత్రి వేళల్లో విద్యార్థుల కదలికలను, సున్నితమైన ప్రాంతాలలో అనుమానాస్పద కార్యకలాపాలను పర్యవేక్షించడానికి డ్రోన్‌లను ఉపయోగిస్తామని పోలీసులు తెలిపారు. విద్యార్థులు ఎక్కడ గుమిగూడుతున్నారో తెలుసుకుంటారు. అందులో మాదకద్రవ్యాలకు సంబంధించిన ప్రదేశాలను గుర్తిస్తారు. అనుమానాస్పద వ్యక్తులపై తక్షణ పరీక్షలు నిర్వహించేందుకు, రాత్రి గస్తీ బృందాలకు ప్రత్యేక డ్రగ్ డిటెక్షన్ కిట్లను కూడా అందించారు.

Malkajgiri CP Sumathi | హాస్టల్ యాజమాన్యాలకు హెచ్చరిక

పోలీసులు ఇప్పటికే సరూర్‌నగర్ (Saroor Nagar) పరిధిలోని హాస్టళ్లలో ప్రత్యేక తనిఖీ నిర్వహించి, హాస్టల్ నిర్వాహకులకు కఠినమైన సూచనలు జారీ చేశారు. అధిక రిజల్యూషన్ గల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు గమనిస్తే వెంటనే తల్లిదండ్రులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలకు, మాదకద్రవ్యాల దుర్వినియోగానికి సహకరిస్తున్నట్లు తేలిన హాస్టళ్లను సీజ్​ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Malkajgiri CP Sumathi | పాన్ షాపులపై..

నిషేధిత పదార్థాలను విక్రయిస్తున్నాయని అనుమానిస్తున్న పాన్ షాపులపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు సీపీ తెలిపారు. నగర భద్రతను కాపాడటంలో, అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించడంలో పాదచారులు, స్థానిక నివాసితులతో సహా పౌరులు పోలీసులకు చురుకుగా సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఒక్కసారి డ్రగ్స్​ కేసు నమోదు అయితే విద్యార్థుల జీవితం నాశనం అవుతుందని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..: Modi Hyderabad Visit | మే 10న భాగ్యనగరానికి మోదీ.. పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

May 09 Gold Prices | గోల్డ్ లవర్స్‌కు ఊరట.. రెండు రోజుల తర్వాత తగ్గిన బంగారం ధర!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 09 Gold Prices | దేశీయ మార్కెట్‌లో బంగారం...

CDS Raja Subramani | చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎన్‌ఎస్‌ రాజా సుబ్రమణి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: CDS Raja Subramani | కీలక సైనిక నియామకాన్ని...

May 09 Horoscope | గృహ సంబంధిత ఇన్వెస్ట్‌మెంట్‌.. భవిష్యత్తులో జాక్‌పాట్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 09 Horoscope | గ్రహాల గమనంలో కనిపిస్తున్న...

Cisco Abhilash Reddy Package | రూ. 2 కోట్ల వార్షిక వేతనం సాధించిన తెలంగాణ తేజం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Cisco Abhilash Reddy Package | పాలమూరు జిల్లా అడ్డాకుల...