Ashu Reddy Notices | అషురెడ్డికి పోలీసుల నోటీసులు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ashu Reddy Notices | నటి అషురెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రూ. 9.35 కోట్ల మోసం అంశంలో సోమవారం విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని అషురెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు (High Court) కొట్టివేసింది.

నటి, బిగ్​బాస్​ ఫేమ్​ అషురెడ్డి తన కుమారుడిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.9.35 కోట్లు వసూలు చేసిందని హైదరాబాద్​కు చెందిన వై.సత్యనారాయణమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. లండన్ (London)​లో ఉన్న తన కుమారుడి నుంచి విడతల వారిగా డబ్బులు తీసుకొని ఇప్పుడు మోసం చేసిందని ఆయన సీసీఎస్​ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై గతంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు.

Ashu Reddy Notices | స్టేకు హైకోర్టు నిరాకరణ

తనపై వచ్చిన ఆరోపణలను అషురెడ్డి ఖండించారు. అంతేగాకుండా కేసు కొట్టేయాలని హైకోర్టు ఆశ్రయించారు. అషురెడ్డి, ఆమె తల్లి కె.యశోదరెడ్డిలపై దర్యాప్తు నిలిపివేయడానికి హైకోర్టు నిరాకరించింది. వారు దాఖలు చేసిన పిటిషన్​ను తిరస్కరించింది. దీంతో తాజాగా సీసీఎస్​ పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అషురెడ్డి విచారణకు హాజరు అవుతారా.. లేదా అనేది చూడాలి.

ఇది కూడా చదవండి..: Meena Driverless Taxi | డ్రైవర్ లేని కారులో నటి మీనా ప్రయాణం.. వీడియో వైరల్!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *