Meena Driverless Taxi | డ్రైవర్ లేని కారులో నటి మీనా ప్రయాణం.. వీడియో వైరల్!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Meena Driverless Taxi | వెండితెరపై తన నటనతో కోట్లాది మంది అభిమానుల మనసు దోచుకున్న సీనియర్ నటి మీనా, తాజాగా తన సరికొత్త అనుభవాన్ని పంచుకున్నారు. టెక్నాలజీ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న ‘డ్రైవర్ రహిత టాక్సీ’ (Driverless Taxi) లో ఆమె ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వీడియోను మీనా తన సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. అది ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

Meena Driverless Taxi | విదేశీ పర్యటనలో..

సాధారణంగా కారులో డ్రైవింగ్​ సీటులో డ్రైవర్​ కూర్చొని స్టీరింగ్ తిప్పుతుంటారు. కానీ, మీనా డ్రైవర్ లేని, కేవలం సెన్సార్ల సాయంతో నడిచే ‘రోబో టాక్సీ’లో ప్రయాణించారు. విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఆమె ఈ అరుదైన అనుభవాన్ని పొందారు.

Meena Driverless Taxi | థ్రిల్ అయిన మీనా..

కారు దానంతట అదే మలుపులు తిరుగుతుంటే, ట్రాఫిక్‌ను గుర్తిస్తూ ఆగుతుంటే మీనా ఎంతో సంభ్రమాశ్చర్యాలను వ్యక్తం చేశారు. ఆ థ్రిల్లింగ్ అనుభవాన్ని వీడియో తీస్తూ.. “డ్రైవర్ లేకుండా కారు ప్రయాణం చేయడం నమ్మశక్యంగా అనిపించడం లేదు.. ఈ జర్నీ చాలా అద్భుతంగా ఉంది” అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కారు లోపల స్టీరింగ్ దానంతట అదే తిరుగుతుంటే మీనా ఆశ్చర్యంతో చూస్తున్న దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Meena Driverless Taxi | నెటిజన్ల కామెంట్స్

మీనా షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్స్​ చేస్తున్నారు. “భవిష్యత్తు టెక్నాలజీ అంటే ఇదేనేమో!”, “మీరు చాలా ధైర్యవంతులు మీనా..” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మన దేశంలోనూ ఇలాంటి టెక్నాలజీ ఎప్పుడు వస్తుందా.. అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం మీనా సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా వరుస సినిమాలు, రియాలిటీ షోలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇలాంటి కొత్త విషయాలను తన అభిమానులతో పంచుకోవడం ఆసక్తికరంగా మారింది.

Kodandaram TJS Meeting | ప్రజా సమస్యలపై పోరాటమే టీజేఎస్ లక్ష్యం: ఎమ్మెల్సీ కోదండరాం

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *