జాతీయంBandi Sanjay | బీజేపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దు : కేంద్ర మంత్రి బండి సంజయ్​

Bandi Sanjay | బీజేపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దు : కేంద్ర మంత్రి బండి సంజయ్​

తమది దాడులు చేసే కల్చర్ కాదని, అలా అని బీజేపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్​ అన్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Sanjay | తమది దాడులు చేసే కల్చర్ కాదని, అలా అని బీజేపీ (BJP) కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్​ అన్నారు. గురువారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు.

కరీంనగర్ (Karimnagar)​లో గురువారం మధ్యాహ్నం ఎమ్మెల్యే గంగుల కమలాకర్​ క్యాంప్​ ఆఫీస్​, ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి వాహనాలపై బీజేపీ కార్యకర్తలు దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బండి సంజయ్​ స్పందించారు. తమది దాడుల సంస్కృతి కాదన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేయాలనే ఆలోచన లేదని కార్యకర్తలు చెప్పారన్నారు. ఆ విషయం తనకు ఆలస్యంగా తెలిసిందని చెప్పారు. తాను ఆ సమయంలో సిరిసిల్లలో అధికారిక కార్యక్రమంలో ఉన్నానని తెలిపారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన క్యాంప్​ ఆఫీస్​లో ప్రెస్​మీట్​లు పెట్టి ఏది పడితే అది మాట్లాడటం కూడా తప్పేనన్నారు.

Bandi Sanjay | సహనానికి హద్దు

తమ కార్యకర్తల సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దానిని పిరికితనంగా భావించొద్దని సూచించారు. దాడుల కల్చర్​ తీసుకు వచ్చిందే బీఆర్​ఎస్ (BRS)​ పార్టీ అన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు తమను అనేక ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. అధికారం శాశ్వతం కాదని, పదవి ఉన్నప్పుడు హద్దులో ఉండాలని సూచించారు. గతంలో కేటీఆర్​ సిరిసిల్లకు పోతే బీజేపీ, ఏబీవీపీ (ABVP) కార్యకర్తలను హౌజ్​ అరెస్ట్ చేసే వారని గుర్తు చేశారు. బీఆర్​ఎస్​ హయాంలో రాచరిక పాలన ఉండేదన్నారు.

Bandi Sanjay | ప్రతీకారం తీర్చుకోవడం లేదు

తాను ప్రజా సంగ్రామ యాత్ర (Praja Sangrama Yatra) చేపట్టినప్పుడు అనేక దాడులు చేశారని బండి సంజయ్​ అన్నారు. అయితే దానికి తాము ప్రతీకారం తీర్చుకోవడం లేదన్నారు. తాజాగా కార్యకర్తలు చేసిన దాడిని తాను సమర్థించడం లేదని తెలిపారు. దాడుల గురించి మాట్లాడే అర్హత బీఆర్​ఎస్​ నాయకులకు లేదన్నారు. దాడులకు దూరంగా ఉండాలని బీజేపీ కార్యకర్తలకు సూచించారు.

దీనిని కూడా చదవండి : Telangana Rains | అకాల వర్షానికి తడిసిన ధాన్యం

 

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Meena Driverless Taxi | డ్రైవర్ లేని కారులో నటి మీనా ప్రయాణం.. వీడియో వైరల్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Meena Driverless Taxi | వెండితెరపై తన నటనతో...

Bakrid Peace Meeting | బక్రీద్​ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి..: సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, బోధన్​: Bakrid Peace Meeting | బక్రీద్ పండుగను (Bakrid...

Indiramma Housing Scheme | భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం.. వారికి కూడా ఇళ్లు! : మంత్రి పొంగులేటి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma Housing Scheme | రాష్ట్రంలో భూ...

Telangana Rains | అకాల వర్షానికి తడిసిన ధాన్యం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Rains | తెలంగాణలో అకాల వర్షం...