Hantavirus WHO Alert | కొవిడ్​ను మించిన వైరస్.. ప్రపంచ దేశాలను అలర్ట్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hantavirus WHO Alert | హంతా వైరస్ వ్యాప్తిపై ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తూ World Health Organization హెచ్చరికలు జారీ చేసింది. కొవిడ్ కంటే ప్రమాదకర ప్రభావాలు కలిగించే అవకాశమున్న ఈ వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిఘా పెట్టినట్లు వెల్లడించింది.

Hantavirus WHO Alert | ‘ఎంవీ హోండియస్’లో కలకలం

ఇటీవల డచ్ క్రూయిజ్ షిప్ అయిన  ‘ఎంవీ హోండియస్’లో ఈ హంతా వైరస్ కలకలం రేపింది. ఈ వైరస్ బారినపడి ముగ్గురు మరణించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. షిప్‌లో మొత్తం 23 దేశాలకు చెందిన దాదాపు 149 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు సమాచారం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. హంతా వైరస్ ఎక్కువగా ఎలుకల మూత్రం, లాలాజలం, విసర్జనల ద్వారా వ్యాపిస్తుందని తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం గుర్తించిన ‘ఆండీస్ స్ట్రెయిన్’ చాలా అరుదుగా మనుషుల మధ్య సైతం వ్యాపించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Hantavirus WHO Alert | కాంటాక్ట్ ట్రేసింగ్

వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా పలు దేశాలతో కలిసి ఇప్పటికే కాంటాక్ట్ ట్రేసింగ్, పర్యవేక్షణ చేపట్టినట్లు WHO వెల్లడించింది. వైరస్ లక్షణాలు కనిపించిన వారిని ఐసోలేషన్‌లో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.

ఈ ఘటనతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. హంతా వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Humanoid Robot Monk | ఆధ్యాత్మిక రంగంలోకి ఏఐ.. దక్షిణ కొరియాలో ‘రోబో సన్యాసి’ అరంగేట్రం!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *