Delhi Airport Marijuana | ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి స్వాధీనం.. ఇద్దరు నిందితుల అరెస్టు

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Delhi Airport Marijuana | ఢిల్లీలోని Indira Gandhi International Airport లో కస్టమ్స్ అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులోవియత్నాం నుంచి వచ్చిన ఇద్దరు భారతీయ ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Delhi Airport Marijuana | వియత్నాం నుంచి

అధికారుల వివరాల ప్రకారం.. మే 5న వియత్నాం నుంచి ఢిల్లీకి చేరుకున్న ఇద్దరు ప్రయాణికులు గ్రీన్ ఛానల్ ద్వారా బయటకు వెళ్లేందుకు యత్నించారు. అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు వారిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్నాక్స్​ ప్యాకెట్లలో అత్యంత చాకచక్యంగా దాచిన గంజాయి బయటపడింది.

స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ దాదాపు రూ.9 కోట్ల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని కస్టమ్స్ అధికారులు చెప్పారు.

Humanoid Robot Monk | ఆధ్యాత్మిక రంగంలోకి ఏఐ.. దక్షిణ కొరియాలో ‘రోబో సన్యాసి’ అరంగేట్రం!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *