నిజామాబాద్Paddy Transport Issue | ఎమ్మెల్యే జోక్యంతో ధాన్యం తరలింపు సమస్యకు పరిష్కారం

Paddy Transport Issue | ఎమ్మెల్యే జోక్యంతో ధాన్యం తరలింపు సమస్యకు పరిష్కారం

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ధాన్యాన్ని రైస్​మిల్లులకు తరలించే ప్రక్రియలో విపరీతమైన జాప్యం ఏర్పడుతోంది. అయితే ఎమ్మెల్యే చొరవతో సమస్య పరిష్కారం అయ్యింది.

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Paddy Transport Issue | ఎల్లారెడ్డి నియోజకవర్గంలో (Yellareddy Constituency) ధాన్యాన్ని రైస్​మిల్లులకు తరలించే ప్రక్రియలో విపరీతమైన జాప్యం ఏర్పడుతోంది. కొనుగోళ్లు పూర్తయినప్పటికీ ధాన్యం తరలించేందుకు లారీల కొరత కారణంగా ఇబ్బందులు వస్తున్నాయి.

Paddy Transport Issue | ఎమ్మెల్యే ఆదేశాలతో..

ధాన్యం తరలింపులో జరుగుతున్న జాప్యంపై నాయకులు ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు (mla madan mohan rao) దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన ఆయన జిల్లా సివిల్ సప్లయ్స్​ అధికారి (DCSO)తో గురువారం చర్చించారు. ప్రస్తుతం కొనుగోలు చేసిన ధాన్యానికి ఒకే రైస్ మిల్లును (rice mills) కేటాయించడంతో అక్కడ తీవ్ర రద్దీ ఏర్పడిందని, దీంతో లారీలు రోజుల తరబడి రోడ్డుపైనే వేచి ఉండాల్సి వస్తోందని ఆయన అన్నారు. దీంతో లారీ డ్రైవర్లు, కార్మికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అధికారులకు వివరించారు.

Paddy Transport Issue | మరిన్ని రైస్​మిల్లులు కేటాయించాలి..

సమస్యను వెంటనే పరిష్కరించేందుకు ధాన్యాన్ని ఒకే మిల్లుకు కాకుండా మరిన్ని రైస్ మిల్లులకు కేటాయించాలని డీసీఎస్​వోకు ఎమ్మెల్యే సూచించారు. దీనివల్ల ధాన్యం క్లియరెన్స్ వేగంగా జరిగి రైతులు, లారీ యజమానులు, కార్మికులకు ఉపశమనం కలుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే చొరవతో అధికారులు చర్యలు ప్రారంభించారు. ధాన్యం తరలింపుల్లో ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు.

ఇది కూడా చదవండి: Vivo X300 FE 5G | వీవో నుంచి ప్రీమియం ఫోన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Revanth Reddy Convoy | సాధారణ ట్రాఫిక్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy Convoy | ముఖ్యమంత్రి వస్తున్నారంటే...

Stock Market | రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాట.. స్వల్ప నష్టాలతో ముగిసిన సూచీలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | అమెరికా, ఇరాన్ ల...

Jailer Love Story | ఖైదీతో జైలర్ ప్రేమాయణం.. పెళ్లి పీటలెక్కిన అరుదైన ప్రేమకథ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jailer Love Story | ప్రేమకు సరిహద్దులు...