Kamareddy Ganesh Shobhayatra | కామారెడ్డిలో నిమజ్జనానికి కదిలిన గణనాథులు..

తొమ్మిది రోజులు పూజలందుకున్న గణనాథులకు నిమజ్జనానికి బయలుదేరాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Ganesh Shobhayatra | తొమ్మిది రోజులు పూజలందుకున్న గణనాథులకు నిమజ్జనానికి (Ganesh Immersion) బయలుదేరాయి. జిల్లాకేంద్రంలో (Kamareddy) గురువారం రాత్రి గణేష్​ శోభాయాత్రను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan), ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra), మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఇప్ప ఉమారాణి ప్రారంభించారు.

Kamareddy Ganesh Shobhayatra | యువజన సమాఖ్య గణపతి ముందు కదలగా..

యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్ గణపతిని ప్రత్యేక వాహనంలో ధర్మశాల వద్దకు తీసుకువచ్చి మొదటి పూజ నిర్వహించారు. గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ.. శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. శోభాయాత్ర సజావుగా సాగేలా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పోలీసులు, అధికారులకు సహకరించాలని కోరారు. మరోవైపు పోలీసులు డిజెలకు అనుమతి నిరాకరించడంతో ప్రత్యేకంగా తెప్పించిన డోలక్ చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. శోభాయాత్ర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోకి వాహనాలు రాకుండా ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాటు చేశారు. రంగురంగుల అలంకరణలో వినాయకులు అలరించాయి.

ganesgh3 ganesh1 1 ganesh21 ganesh33 1 ganesh87667

ఇది కూడా చదవండి: ఉత్తరాంధ్రను వణికిస్తున్న భారీ వర్షాలు నిరంతరం సమీక్షిస్తున్న ఏపీ సీఎం

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *