Shepherd Road Accident | డీసీఎం వ్యాన్​ ఢీకొని మేకల కాపరి మృతి

డీసీఎం వ్యాన్​ ఢీకొని మేకల కాపరి మృతి చెందాడు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Shepherd Road Accident | డీసీఎం వ్యాన్​ ఢీకొని మేకల కాపరి మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి (Kamareddy), ఎల్లారెడ్డి రహదారిపై కొట్టాల్ గ్రామం వద్ద శుక్రవారం చోటు చేసుకుంది.

Shepherd Road Accident | 20 మేకలు సైతం..

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొట్టాల్‌కు చెందిన ఆలకుంట శివయ్య, బోదాస్ గంగారం, కిషన్ తమ మేకలను కొట్టం నుంచి వదిలి మేత కోసం అడవికి తీసుకెళ్తున్నారు. అదే సమయంలో కామారెడ్డి వైపు నుంచి ఎల్లారెడ్డి (Yellareddy) వైపు అతివేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ మేకలను, కాపరి శివయ్యను ఢీకొట్టింది. అపస్మారక స్థితిలో ఉన్న శివయ్యను ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఆలకుంట శివయ్యకు చెందిన 13 మేకలు, బోదాస్ గంగారాంకు చెందిన 2 మేకలు, కిషన్‌కు చెందిన 5 మేకలు అక్కడికక్కడే మృతిచెందాయి. సమాచారం అందుకున్న ఎల్లారెడ్డి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Cycling Competition | 13న జిల్లాస్థాయి సైక్లింగ్​ పోటీలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *