Jaishankar Russia Oil | మీరు అమ్మే ఆయుధాలతోనే భారత్‌పై దాడి: యూరప్‌ను నిలదీసిన జైశంకర్

రష్యా-ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో, రష్యా నుండి భారత్ చమురును కొనుగోలు చేయడాన్ని విమర్శిస్తున్న పాశ్చాత్య దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ( Jaishankar )  గట్టి కౌంటర్ ఇచ్చారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Jaishankar Russia Oil | రష్యా-ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో, రష్యా నుండి భారత్ చమురును కొనుగోలు చేయడాన్ని విమర్శిస్తున్న పాశ్చాత్య దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ( Jaishankar )  గట్టి కౌంటర్ ఇచ్చారు. ఫిన్‌లాండ్‌లో జరిగిన ‘కుల్తారంటా చర్చల’లో పాల్గొన్న ఆయన, భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని సమర్థిస్తూ, ఐరోపా దేశాల తీరులోని వైరుధ్యాలను ఎండగట్టారు.

Jaishankar Russia Oil | ధర, లభ్యత ప్రాతిపదికనే..

రష్యా పట్ల భారత్ అధిక సానుభూతి చూపిస్తోందని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు జైశంకర్ స్పందిస్తూ, తాము కేవలం జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. “నేను చమురును ధర , లభ్యత ఆధారంగానే కొనుగోలు చేస్తాను. సాధారణంగా భారత్ ఇంధనం కోసం మధ్యప్రాచ్య దేశాలపైనే ఆధారపడుతుంది. కానీ, ఐరోపా దేశాలు అక్కడి నుండి అధికంగా చమురును కొనుగోలు చేయడం వల్ల పరిస్థితులు మమ్మల్ని రష్యా వైపు చూసేలా చేశాయి” అని ఆయన వివరించారు.

jaishanker.1

Jaishankar Russia Oil | ఐరోపా దేశాలకు జైశంకర్ సూటి ప్రశ్నలు..

భారత భద్రత విషయంలో ఐరోపా దేశాల తీరును జైశంకర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. “ప్రపంచంలో ఏ ఐరోపా దేశంపై కూడా భారతీయ ఆయుధాలతో దాడి జరగలేదు. కానీ, భారత్‌పై దాడి చేయడానికి ఉపయోగించే ఆయుధాలను యూరప్ దేశాలు సరఫరా చేస్తున్నాయి. ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది.” భారతదేశం ఎప్పుడూ ఐరోపాకు ప్రమాదకరంగా ఏమీ చేయలేదని, భారత్ ఎప్పుడూ శాంతియుత మార్గంలోనే నడుస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.

Jaishankar Russia Oil | ఆచరణాత్మక విధానం..

ఇంధన భద్రతను కాపాడుకోవడంలో భారత్ ఎంతో ఆచరణాత్మక విధానాన్ని (Pragmatic approach) అనుసరిస్తోందని జైశంకర్ స్పష్టం చేశారు. బాహ్య ఒత్తిళ్లకు లొంగిపోకుండా, దేశ ప్రయోజనాలే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆయన ఈ చర్చల ద్వారా ప్రపంచానికి తెలియజేశారు.

ఇది కూడా చదవండి:  Shepherd Road Accident | డీసీఎం వ్యాన్​ ఢీకొని మేకల కాపరి మృతి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *