Bheemgal Ganja Seizure | ఎక్సైజ్ దాడుల్లో గంజాయి పట్టివేత.. ముగ్గురు బైండోవర్!

shashi kiran Mottala

భీమ్​గల్, అక్షరటుడే: Bheemgal Ganja Seizure | మండల పరిధిలో గంజాయి విక్రయాలు, వినియోగంపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం గట్టి నిఘా పెట్టింది. భీమ్‌గల్‌ మండలం (Bheemgal Mandal) సంతోష్‌నగర్‌ తండా సమీపంలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించింది.

Bheemgal Ganja Seizure | ముగ్గురు వ్యక్తులను..

ఈ తనిఖీల్లో భీమ్‌గల్​కు చెందిన షేక్‌ మజాస్‌ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 100 గ్రాముల ఎండు గంజాయితో పాటు ఒక మొబైల్‌ ఫోన్‌ను ఎక్సైజ్ అధికారులు (Excise Officers) స్వాధీనం చేసుకున్నారు. మండలంలో గంజాయి తీసుకోవడాన్ని అలవాటుగా మార్చుకున్న మరో ముగ్గురు వ్యక్తులను ఎక్సైజ్ బృందం గుర్తించింది. అనంతరం వారిని, వారి తల్లిదండ్రులను ఎక్సైజ్ కార్యాలయానికి పిలిపించారు. తల్లిదండ్రుల సమక్షంలోనే గంజాయి సేవించడం వల్ల కలిగే శారీరక, మానసిక దుష్ప్రభావాల గురించి, చట్టపరమైన ఇబ్బందుల గురించి వారికి క్షుణ్ణంగా అవగాహన కల్పించి హెచ్చరించారు.

Bheemgal Ganja Seizure

ఆ తర్వాత భవిష్యత్తులో ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉంటామనే నిబంధనపై భీమ్‌గల్‌ తహశీల్దార్‌ ఎదుట ఆ ముగ్గురు వ్యక్తులను బైండోవర్ చేసినట్లు భీమ్‌గల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ పి.వేణుమాధవ్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో గంజాయి తదితర మత్తు పదార్థాల విక్రయదారులపై, వినియోగదారులపై నిరంతరం నిఘా ఉంటుందని, చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో అబ్కారీ శాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Shepherd Road Accident | డీసీఎం వ్యాన్​ ఢీకొని మేకల కాపరి మృతి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *