అక్షరటుడే, వెబ్డెస్క్ : HMDA Chief Engineer | ఏసీబీ అధికారులు (ACB Officers) దూకుడు పెంచారు. పదవులను అడ్డు పెట్టుకొని భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన అధికారుల భరతం పడుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు చేసి నిందితుల ఇళ్లలో సోదాలు చేపడుతున్నారు.
HMDA Chief Engineer | ఆదాయానికి మించిన ఆస్తులు
అక్రమ ఆస్తుల కేసులో మంగళవారం హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ నివాసం ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. ఆయన కుటుంబానికి చెందిన 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. నగదు, బంగారం, స్థిరాస్తుల డాక్యుమెంట్లు, బ్యాంకు లాకర్లను తనిఖీ చేస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ మాజీద్ ఖాన్ ఆధ్వర్యంలో రవీందర్ పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. రవీందర్ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు సమాచారం. సోదాలు ముగిసిన అనంతరం అధికారులు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
ఇది కూడా చదవండి..: AE Caught by ACB | రూ.2 లక్షల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ