CM Overseas Scholarships | సీఎం ఓవర్సీస్​ స్కాలర్​షిప్​లకు దరఖాస్తుల ఆహ్వానం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Overseas Scholarships | మైనారిటీ విద్యార్థులకు ముఖ్యమంత్రి ఓవర్సీస్​ స్కాలర్​షిప్​ల కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్​ సఫీయుల్లా ఉత్తర్వులు జారీ చేశారు.

విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం స్కాలర్​షిప్​ అందిస్తోంది. మైనారిటీ విద్యార్థుల (Minority students) కోసం సీఎం ఓవర్సీస్​ స్కాలర్​షిప్​ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకానికి సంబంధించి తాజాగా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. ముఖ్యమంత్రి ఉపకారవేతన పథకం కింద విదేశాలలో పీజీ (PG), పీహెచ్​డీ (PhD) చేసే వారికి ఆర్థిక సాయం అందనుంది.

students 3

CM Overseas Scholarships | వీరు అర్హులు

సంబంధిత స్కాలర్​షిప్​ పొందడానికి ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు ఉండాలి. అంతేగాకుండా జనవరి 1 నుంచి జూన్​ 30 వరకు విదేశీ విశ్వవిద్యాలయాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్/డాక్టోరల్ కోర్సులలో ప్రవేశం పొందిన విద్యార్థులు www.telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జూన్​ 1 నుంచి 30 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు అనంతరం సంబంధిత జిల్లా మైనారిటీల సంక్షేమ కార్యాలయాలలో హార్డ్ కాపీలు/అవసరమైన పత్రాలను జులై 31లోగా సమర్పించాలి. పథకం వివరాలు, అర్హతా ప్రమాణాలు, దరఖాస్తు చేసుకోవలసిన దేశాలు వంటి వివరాల కోసం వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.

దీనిని కూడా చదవండి : Women Auto Driver | సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి.. ఆటో డ్రైవర్‌గా మారిన మహిళా టెక్కీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *