BITS Pilani Hyderabad PhD | బిట్స్‌ పిలానీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ అవకాశాలు.. రూ.48 వేల వరకు స్టైపెండ్

గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఎంటెక్‌, ఎంఈ, బీఈ లేదా బీటెక్‌ విద్యార్హత కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: BITS Pilani Hyderabad PhD | ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే అభ్యర్థులకు బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌ పిలానీ) హైదరాబాద్‌ క్యాంపస్‌ నుంచి మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం సంస్థ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

BITS Pilani Hyderabad PhD | అర్హతలు ఇలా..

కంప్యూటర్‌ సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ లేదా సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఎంటెక్‌, ఎంఈ, బీఈ లేదా బీటెక్‌ విద్యార్హత కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థుల గరిష్ట వయసు 28 ఏళ్లుగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

BITS Pilani Hyderabad PhD | ఎంపిక విధానం:

దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం నిర్వహించే ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేపడతారు.

AI Shiva Song Balochistan | నెట్టింట మార్మోగుతున్న’శివ బోలో.. బలూచిస్తాన్ ఆజాద్’: ఏఐ సృష్టించిన అద్భుత ఆధ్యాత్మిక, సాంస్కృతిక గీతం!

స్టైపెండ్‌:

పీహెచ్‌డీకి ఎంపికైన వారికి నెలకు గరిష్టంగా రూ.48 వేల వరకు స్టైపెండ్‌ అందించే అవకాశం ఉంది. దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 20.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు బిట్స్‌ పిలానీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌, అర్హతలు, దరఖాస్తు విధానం, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించాలని సూచించారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *