అక్షరటుడే, వెబ్డెస్క్: Unemployed Protest | నిరుద్యోగులు పోరుబాట పట్టారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆందోళనలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్ (Hyderabad)లోని ఇందిరా పార్క్ చౌరస్తాలో సోమవారం నిరుద్యోగుల మెరుపు ధర్నా నిర్వహించారు. 7,437 పోస్టులతో కాకుండా 19 వేల పోలీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ ఉద్యోగాల వయోపరిమితి పెంచాలన్నారు. కొన్నేళ్లుగా నోటిఫికేషన్ వేయకపోవడంతో వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Unemployed Protest | 36 ఏళ్లకు పెంచాలి
పోలీస్ నోటిఫికేషన్‌లో కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని 36 సంవత్సరాలకు, ఎస్సై పోస్టులకు 38 సంవత్సరాలకు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అంతేగాకుండా దరఖాస్తు రుసుమును తగ్గించాలన్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నిరుద్యోగుల హెచ్చరించారు. కాగా ఇటీవల ఢిల్లీలో యువత చేపట్టిన నిరసనలకు కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి మద్దతు తెలిపారు. తెలంగాణలో నిరుద్యోగుల ఆందోళనపై మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదు.
Unemployed Protest | జాబ్ క్యాలెండర్ ఎక్కడ
తాము అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రెండున్నరేళ్లు దాటిపోతున్నా.. దాని ఊసే లేకుండా పోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పోలీస్ ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 7,437 పోస్టులకు నోటిఫికేషన్ రాగా.. నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. 19 వేల ఖాళీలు ఉన్నాయని, అన్ని పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Weather Update | తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన