బిజినెస్​June 01 Market Analysis | లాభాల్లో గ్లోబల్ మార్కెట్లు.. ఫ్లాట్ ఓపెనింగ్ ను సూచిస్తున్న...

June 01 Market Analysis | లాభాల్లో గ్లోబల్ మార్కెట్లు.. ఫ్లాట్ ఓపెనింగ్ ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ సైతం లాభాలతో ట్రేడ్ అవుతోంది. దీంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభం కానున్నాయి.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: June 01 Market Analysis | అమెరికా – ఇరాన్ శాంతి ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతున్నా.. క్రూడ్ ఆయిల్ ధరలు అదుపులో ఉండడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పాజిటివ్‌గా ఉంది. గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్ లాభాలతో ముగియగా.. యూరోపియన్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.

ప్రధాన ఆసియా మార్కెట్లు సోమవారం ఉదయం లాభాలతో కొనసాగుతున్నాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి అందుతున్న సానుకూల సంకేతాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్‌లో బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ నూతన వారాన్ని ఫ్లాట్ టు పాజిటివ్ గా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

Stock Market Gains

June 01 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

టెక్ షేర్ల ర్యాలీతో అమెరికా స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం రికార్డు స్థాయి ముగింపును నమోదు చేసింది. గత సెషన్‌లో నాస్‌డాక్ 0.20 శాతం, ఎస్ అండ్ పీ 0.22 శాతం పెరిగాయి. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.14 శాతం లాభంతో ఉంది.

June 01 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.05 శాతం పెరగ్గా.. యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.16 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.07 శాతం నష్టపోయాయి.

June 01 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 4.39 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.85 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.97 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.93 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.75 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.55 శాతం లాభాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ, నిఫ్టీ 0.15 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Stock Market Rally

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు వరుసగా 3వ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 21,105 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు 9వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 16,764 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.02 నుంచి 0.74 కు తగ్గింది.
  • విక్స్ 8.03 శాతం పెరిగి 16.18 వద్ద ఉంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 2.44 శాతం పెరిగి 93.35 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 67 పైసలు బలపడి 95.03 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.05 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.47 వద్ద ఉన్నాయి.

ఆర్‌బీఐ ద్రవ్య విధానం, అమెరికా -ఇరాన్ శాంతి చర్చలు, ముడి చమురు ధరల కదలిక, హార్ముజ్ జలసంధి ద్వారా జరిగే షిప్పింగ్ కార్యకలాపాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఈ వారం మార్కెట్ ను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి.

Japan Population Crisis | సూర్యుడు ఉదయించే దేశంలో.. శృంగార అస్తమయం!

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Germany Transit Visa | భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్: ఇకపై ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా లేకుండానే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Germany Transit Visa | అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులకు...

Super El Nino | భూగోళాన్ని భయపెడుతున్న ‘సూపర్ ఎల్ నినో’: భారత్​పై ఎలాంటి ప్రభావం చూపనుందంటే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Super El Nino | ప్రపంచ వాతావరణాన్ని సమూలంగా...

Chain Snatcher Arrest | ఈ చైన్​ స్నాచర్ మామూలోడు కాదు సుమా​.. 180 కేసుల్లో నిందితుడు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chain Snatcher Arrest | ఉభయ తెలుగు రాష్ట్రాల్లో...

Iran Nuclear Negotiations | అణు చర్చలకు ఇరాన్ సుముఖత: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran Nuclear Negotiations | తమ అణు కార్యక్రమానికి...