అక్షరటుడే, వెబ్డెస్క్: Paras Healthcare IPO | పారాస్ హెల్త్ కేర్ లిమిటెడ్ ను 1987లో స్థాపించారు. ఉత్తర భారతదేశం, బిహార్, జార్ఖండ్లలోని గుర్గావ్, పంచకుల, పాట్నా, దర్భంగా, కాన్పూర్, ఉదయ్పూర్, రాంచి, శ్రీనగర్ ప్రాంతాలలో ఎనిమిది హాస్పిటల్స్ నిర్వహిస్తోంది. మొత్తం 2,211 పడకల సామర్ధ్యం కలిగి ఉంది. గుండె సంరక్షణ, క్యాన్సర్ చికిత్స, మెదడు మరియు నరాల సంరక్షణ, జీర్ణ ఆరోగ్యం, ఎముకలు మరియు కీళ్ల మార్పిడి వంటి వివిధ రకాల వైద్య సేవలను అందిస్తోంది.
Paras Healthcare IPO | రూ. 1,450 కోట్ల సమీకరణ కోసం..
మార్కెట్ నుంచి రూ. 1,450 కోట్ల నిధులు సమీకరించాలన్న లక్ష్యంతో పారాస్ హెల్త్ కేర్ లిమిటెడ్ ఐపీవోకు వస్తోంది. ఇందులో రూ. 1 ఫేస్ వ్యాల్యూ కలిగిన 72,15,007 తాజా షేర్లను విక్రయించడం ద్వారా రూ. 500 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ కింద రూ. 1 ఫేస్ వ్యాల్యూ కలిగిన 1,37,08,513 షేర్లను అమ్మడం ద్వారా రూ. 950 కోట్లు పొందనుంది. ఐపీవో (IPO) ద్వారా వచ్చిన ఆదాయాన్ని రుణాల చెల్లింపు, అనుబంధ సంస్థలో పెట్టుబడులు, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.
Paras Healthcare IPO | ప్రైస్ బ్యాండ్..
కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 660 నుంచి రూ. 693 లుగా నిర్ణయించింది. లాట్ లో 21 షేర్లున్నాయి. ఈ ఐపీవోలో పాల్గొనాలనుకునే రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ అయిన రూ. 693 వద్ద రూ. 14,553 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
కోటా : క్యూఐబీలకు 75 శాతం, ఎన్ఐఐలకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం వాటాను కేటాయించడం జరిగింది.
జీఎంపీ : పారాస్ హెల్త్ కేర్ లిమిటెడ్ ఐపీవోకు సంబంధించి గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 110 గా ఉంది. ఒకవేళ ఐపీవో అలాట్ అయితే లిస్టింగ్ సమయంలో సుమారు 16 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఐపీవో తేదీలు : ఐపీవో సబ్స్క్రిప్షన్ అక్టోబర్ 21న ప్రారంభమై 23న ముగుస్తుంది. అక్టోబర్ 26న షేర్స్ అలాట్మెంట్ జరగనుంది. కంపెనీ షేర్లు అక్టోబర్ 28న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ అవుతాయి.
ఇది కూడా చదవండి..: Reliance Joyland Milk | డెయిరీ రంగంలోకి రిలయన్స్.. జాయ్ల్యాండ్ పేరుతో ఫ్లేవర్డ్ మిల్క్ విక్రయాలు