అక్షరటుడే వెబ్‌డెస్క్: Windfall Tax India | ఇంధన ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్ (అదనపు లాభాల పన్ను)ను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, డీజిల్ (Diesel ) ఎగుమతులపై లీటరుకు రూ.16గా ఉన్న రుసుమును రూ.8.50కి తగ్గించగా, పెట్రోల్ ఎగుమతులపై రూ.0.50గా ఉన్న సుంకాన్ని రూ.2.50కి పెంచారు.
Windfall Tax India | ఇంధన కొరత తలెత్తకుండా ..
ఈ పన్ను మార్పులు కేవలం విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్‌కు మాత్రమే పరిమితమవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. దేశీయ మార్కెట్లో లభించే ఇంధన ధరలపై గానీ, స్థానిక ఎక్సైజ్ సుంకాలపై గానీ దీని ప్రభావం ఏమాత్రం ఉండదు. కాబట్టి పెట్రోల్ బంకుల్లో లభించే పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పులు ఉండవు. దేశంలో ఇంధన కొరత తలెత్తకుండా చూడటం, చమురు సంస్థలు స్థానిక అవసరాలను పక్కనపెట్టి కేవలం విదేశీ లాభాల కోసం ఎగుమతులు చేయకుండా కట్టడి చేయడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశం.
Windfall Tax India | మార్కెట్ పరిస్థితులు..
అంతర్జాతీయంగా ముడిచమురు ధరల్లో వచ్చే మార్పులు, చమురు శుద్ధి సంస్థలు పొందే అదనపు లాభాల ఆధారంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రభుత్వం ఈ పన్ను రేట్లను పునఃసమీక్షిస్తుంది. అంతకుముందు అక్టోబర్ 1వ తేదీన జరిగిన సమీక్షలో డీజిల్ ఎగుమతి సుంకాన్ని రూ.20 నుంచి రూ.16కి తగ్గించిన సంగతి తెలిసిందే.
Windfall Tax India | విండ్‌ఫాల్ ట్యాక్స్ నేపథ్యం..
చమురు కంపెనీలు ఊహించని రీతిలో పొందే విపరీతమైన లాభాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా జులై 2022లో ఈ విండ్‌ఫాల్ పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది. సుమారు రెండేళ్ల పాటు కొనసాగిన ఈ పన్నును ఆ తర్వాత నిలిపివేసినప్పటికీ, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మార్చి 2026 నుంచి మళ్లీ అమల్లోకి తీసుకువచ్చారు. ప్రస్తుతానికి దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Paras Healthcare IPO | ఐపీవోకు హెల్త్ కేర్ కంపెనీ.. 21నుంచి అందుబాటులోకి..