Stock Market Today | లాభాల బాటలో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో కొనసాగుతోంది. ఉదయం 11.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 272 పాయింట్లు, నిఫ్టీ 93 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Today | దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో కొద్దిసేపటికే ప్రధాన సూచీలు నష్టాల బాట పట్టాయి. అయితే కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్, నిఫ్టీ పైకి పరుగులు తీశాయి.

టెక్ మహీంద్రా రెండో త్రైమాసిక ఫలితాలు బాగుండడంతోపాటు బలమైన ఒప్పందాలతో ఆ కంపెనీ షేర్లు శుక్రవారం ఇంట్రాడేలో భారీగా పెరిగాయి. దీని ప్రభావంతో ఐటీ ఇండెక్స్ సైతం 3 శాతానికిపైగా లాభపడింది. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ అత్యంత పేలవమైన ప్రదర్శన ఇస్తోంది. ఈ సూచీలోని దాదాపు అన్ని స్టాక్‌లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.

Stock Market Today | ఫ్లాట్‌గా ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) శుక్రవారం ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 26 పాయింట్ల స్వల్ప లాభంలో ప్రారంభమైనా మొదట్లో లాభాల స్వీకరణతో 329 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 766 పాయింట్లు పెరిగింది. 68 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ.. మొదట్లో 152 పాయింట్లు కోల్పోయింది. ఆ తర్వాత పుంజుకుని 236 పాయింట్లు పైకి ఎగబాకింది. మధ్యాహ్నం 11.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 272 పాయింట్ల లాభంతో 74,587 వద్ద, నిఫ్టీ 93 పాయింట్ల లాభంతో 23,090 వద్ద ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 14 స్టాక్స్ లాభాలతో, 16 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. టెక్ మహీంద్రా 7.52 శాతం, ఇన్ఫోసిస్ 3.63 శాతం, టీసీఎస్ 2.96 శాతం, ఎయిర్‌టెల్ 2.48 శాతం, ఎం అండ్ ఎం 2.28 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : రిలయన్స్ 1.28 శాతం, ఐటీసీ 1.11 శాతం, హెచ్యూఎల్ 0.82 శాతం, ఆసియన్ పెయింట్ 0.81 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.72 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Paras Healthcare IPO | ఐపీవోకు హెల్త్ కేర్ కంపెనీ.. 21నుంచి అందుబాటులోకి..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *