Delimitation Bill | పార్లమెంట్​ ప్రత్యేక సమావేశాలు.. డీలిమిటేషన్​ బిల్లుపై కేంద్రం కసరత్తు!

పార్లమెంట్​ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి డీలిమిటేషన్​ బిల్లును ప్రవేశ పెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Delimitation Bill | మహిళా రిజర్వేషన్​, డీలిమిటేషన్​ బిల్లుపై మరోసారి కేంద్ర ప్రభుత్వం (Central Government) కసరత్తు చేస్తొంది. ఈ మేరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.

బడ్జెట్ సమావేశాల సమయంలో కేంద్రం డీలిమిటేషన్​, మహిళా రిజర్వేషన్​ బిల్లులను తీసుకొచ్చింది. అయితే సరైనా సంఖ్య బలం లేకపోవడంతో లోక్​సభలో ఆ బిల్లు ఆమోదం పొందలేదు. దీంతో మరోసారి ఈ బిల్లులను సభలో ప్రవేశ పెట్టాలని కేంద్రం భావిస్తోంది. సభలో తమకు తగినంత సంఖ్యాబలం ఉందని ప్రభుత్వం ధీమాగా ఉందని, అందుకే ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిసింది.

Delimitation Bill | డీఎంకేతో చర్చలు

ఈ బిల్లుల ఆమోదం కోసం మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ప్రస్తుతం ఎన్​డీఏ కూటమికి అంత బలం లేదు. ఈ క్రమంలో ఇటీవల ఇండియా కూటమితో విడిపోయిన డీఎంకేతో కేంద్రం చర్చలు జరుపుతోంది. ఆ పార్టీ మద్దతు కూడగట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు టీఎంసీ రెబల్​ ఎంపీలు ఎన్​సీపీఐ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వీరు కూడా కేంద్రానికి మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఇటీవల వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న ముగిశాయి. అయితే సభను స్పీకర్​ వాయిదా వేయలేదు. దీంతో ఈ నెలాఖరులో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారని ప్రచారం జరుగుతోంది.

Delimitation Bill | 360 ఓట్లు అవసరం..

ఈ బిల్లుల ఆమోదం కోసం మొత్తం సీట్లలో సుమారు 360 మంది ఎంపీల మద్దతు అవసరం. అయితే ఎన్​డీఏ కూటమికి సొంతంగా అంత మెజారిటీ లేదు. 20 మంది తృణమూల్ ఎంపీలు, ఆరుగురు శివసేన (యూబీటీ) ఎంపీలు ఇటీవల అధికార పక్షంలో చేరారు. దీంతో ఎన్​డీఏ బలం పెరిగింది. మరోవైపు డీఎంకేతో బీజేపీ సంప్రదింపులు జరుపుతోంది. ఎనిమిది మంది ఎంపీలు ఉన్న ఎన్‌సీపీ (ఎస్పీ) వంటి ఇతర పార్టీల నుంచి కూడా ప్రభుత్వం మద్దతు ఆశిస్తున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి..: ram sugar rani rajput | ఏడు పదుల ప్రేమామృతం.. రీల్స్ మహిమో, ఆస్తుల మహత్యమో!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *