Rahul Gandhi | ప్రమాదంలో ప్రజాస్వామ్యం : రాహుల్​ గాంధీ

దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi | దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ అన్నారు. శనివారం సాయంత్రం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

కేంద్రం తీసుకు వచ్చిన డీలిమిటేషన్​ బిల్లుపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. దీనిని బీజేపీ తుది ఆయుధం అభివర్ణించారు. ప్రస్తుత సభ్యుల సంఖ్యకు దాదాపు 1.5 రెట్లు అధికంగా, ప్రతిపాదిత 850 సీట్ల లోక్‌సభ ‘ప్రజాస్వామ్య హత్యకు ప్రతీక’గా నిలుస్తుందని అన్నారు. డీలిమిటేషన్​తో ముడిపెట్టకుండా మహిళా రిజర్వేషన్​ బిల్లును ఇప్పుడే అమలు చేయొచ్చని చెప్పారు. వారి ప్రయోజనాలకు అనుకూలంగా ఉండే విధంగా 850 సీట్ల సంఖ్యను నిర్ణయించారని పెంచారు. ఇది బీజేపీకి గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.

Rahul Gandhi | అదే అసలు సమస్య

సవరించిన బిల్లులు పరిరక్షించడానికే రూపొందించిన ప్రతి రాష్ట్రపు సీట్ల వాటా ఇక్కడ ప్రశ్న కాదని అన్నారు. నియోజకవర్గ సరిహద్దులను పునర్నిర్మించుకోవడానికి బీజేపీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడమే ఇక్కడి సమస్య అని చెప్పారు. ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాలలో “ఓబీసీలకు ఉప-కోటాతో” మహిళా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్​ చేశారు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ నేతలు కొట్టి పారేశారు. అనేక ఎన్నికలలో ఓడిపోవడం వల్ల కలిగిన నిరాశకు ఆయన వాదనలే సంకేతమని బీజేపీ అభివర్ణించింది.

దీనిని కూడా చదవండి : IAS Transfers | పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *