IAS Transfers | పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IAS Transfers | రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ (IAS) అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. పరిపాలనా ఆవశ్యకత దృష్ట్యా, ఐఏఎస్, నాన్-కేడర్ అధికారులకు బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్​ జాజు ఉత్తర్వులు జారీ చేశారు.

హెచ్‌ఎండీఏ (HMDA) మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్​ను మెట్రోపాలిటన్ ఏరియా & అర్బన్ డెవలప్‌మెంట్ ప్రభుత్వ కార్యదర్శిగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌లకు ప్రత్యేక అధికారిగా నియమించారు. హెచ్​ఎండీ మెట్రోపాలిటన్​ కమిషనర్​గా మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్​గా కొనసాగుతున్న ఇ.వి.నరసింహ రెడ్డిని నియమించారు.

IAS Transfers | మెట్రో ఎండీగా అజిత్​ రెడ్డి

ఇన్వెస్ట్ తెలంగాణ, ఐ&సీ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహిస్తున్న అజిత్ రెడ్డిని మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ఎఫ్‌ఏసీగా నియమించారు. ఇన్ని రోజులు ఆ పదవిలో ఉన్న సర్ఫరాజ్ అహ్మద్​ను రిలీవ్ చేశారు. జలమండలి ఎండీ మయాంక్​ మిట్టల్​ను శంషాబాద్​ జోనల్​ కమిషనర్​గా, అక్కడ పని చేస్తున్న కె. చంద్రకళను హెచ్‌ఎండిఏలో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్​గా బదిలీ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ లో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్​గా నియమితులయ్యారు. పి. రామును విద్యాశాఖలో ప్రత్యేక అధికారి (ప్రాజెక్టులు)గా ట్రాన్స్​ఫర్​ చేశారు. అక్కడ పని చేస్తున్న వి. శ్రీనివాస్ రెడ్డిని తన మాతృ విభాగానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

దీనిని కూడా చదవండి : Maoist Era in Telangana | రాష్ట్రంలో మావోయిస్టుల శకం ముగిసింది..: డీజీపీ సీవీ ఆనంద్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *