అక్షరటుడే వెబ్‌డెస్క్: Courtyard Marriott Tirupati | కోర్ట్‌యార్డ్ బై మారియట్ తిరుపతి (Courtyard by Marriott Tirupati) హోటల్‌లో తొలిసారిగా క్రిస్మస్ ( Christmas )కేక్ మిక్సింగ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. పండుగ ఉత్సాహం, వంటకాల సంప్రదాయం, ఆత్మీయత కలబోసిన ఈ సాయంత్రం వేడుకకు స్థానిక అతిథులు, కార్పొరేట్ భాగస్వాములు హాజరయ్యారు. ఈ కార్యక్రమంతో హోటల్‌లో క్రిస్మస్ వేడుకలకు సందడిగా నాంది పలికారు.
Courtyard Marriott Tirupati | సంప్రదాయ కేక్ మిక్సింగ్..
క్రిస్మస్ కేక్ తయారీలో భాగంగా నిర్వహించిన సంప్రదాయ మిక్సింగ్ వేడుకలో అతిథులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎండిన పండ్లు, నట్స్, సుగంధ ద్రవ్యాలు, ఇతర పండుగ పదార్థాలను కలిపి కేక్ మిశ్రమాన్ని సిద్ధం చేశారు. క్రిస్మస్ కరోల్స్, ప్రత్యేక పానీయాలు, సంగీతంతో ఆ ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది.
Courtyard Marriott Tirupati | మరిన్ని ప్రత్యేక రుచులు..
ఈ సందర్భంగా కోర్ట్‌యార్డ్ బై మారియట్ తిరుపతి జనరల్ మేనేజర్ సమత దండే చంద్ మాట్లాడుతూ.. పండుగ కాలం అంటే అందరూ కలిసి మెలిసి జ్ఞాపకాలను పంచుకోవడమేనని తెలిపారు. తమ హోటల్‌లో తొలిసారి నిర్వహించిన కేక్ మిక్సింగ్ వేడుక ద్వారా అతిథులు, స్థానికులు, కార్పొరేట్ భాగస్వాములను ఒకచోట చేర్చడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా ఈ సంప్రదాయంలో పాలుపంచుకోవడం సంతోషాన్నిచ్చిందని, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రత్యేక రుచులు, వేడుకలతో ఈ సందడిని కొనసాగిస్తామని పేర్కొన్నారు. స్థానిక వర్గాలు, కార్పొరేట్ ప్రతినిధుల భాగస్వామ్యంతో ఈ వేడుక చిరస్మరణీయంగా నిలిచింది.
ఇది కూడా చదవండి: Thiruparankundram | తిరుప్పరన్‌కుండ్రం కొండపై వెలిగిన కార్తిక దీపం