అక్షరటుడే, వెబ్డెస్క్ : Thiruparankundram | తమిళనాడులోని తిరుప్పరన్‌కుండ్రం కొండపైనున్న దీపస్తంభంపై ఎట్టకేలకు కార్తిక దీపం వెలిగింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పటిష్ఠ భద్రత నడుమ పూజారులు దీపాన్ని వెలిగించారు. కేవలం 50 మంది భక్తులను మాత్రమే అనుమతించారు.
సుప్రీంకోర్టు నియమించిన ఇద్దరు మాజీ హైకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. “వెట్రివేల్ మురుగనుక్కు అరోహరా”, “వెట్రివేల్, వీరవేల్” అనే నినాదాల మధ్య ఈ దీపాన్ని వెలిగించారు. కొండపై ఉన్న రాతి స్తంభం (దీపత్తూన్) వద్ద జ్వాల కనిపించగానే భక్తులు ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమం కోసం 30 కిలోల నెయ్యి, 50 మీటర్ల పొడవైన పత్తి వత్తి, 5 కిలోల కర్పూరాన్ని ఉపయోగించారు.
Thiruparankundram | భారీగా తరలివచ్చిన భక్తులు
ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు ఉదయం నుండే పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు కొండ పాదాల వద్దకు చేరుకున్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సిబ్బంది కొండ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, అక్కడికి వెళ్లేవారిని నియంత్రించారు. దీపం వెలిగించే సమయంలో కేవలం 50 మందికి మాత్రమే కొండపైకి అనుమతించారు. దీపం వెలిగించిన అనంతరం భక్తులు సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చారు.
#WATCH | Madurai, Tamil Nadu: The ceremonial Karthigai Deepam is lit at the Deepathoon stone pillar at Thiruparankundram Hill following the Supreme Court’s verdict. https://t.co/FymnyKGmyE
— ANI (@ANI) November 28, 2026
దీనిని కూడా చదవండి : Kamareddy Road Safety | రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి