Kavitha Wedding Ceremony | ఇంటి ఆడబిడ్డలా వదువుకు పసుపుతాడు కట్టిన కల్వకుంట్ల కవిత

రాజకీయ నాయకులు సాధారణంగా సభలు, సమావేశాల ద్వారా ప్రజలకు చేరువవుతుంటారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Kavitha Wedding Ceremony | రాజకీయ నాయకులు సాధారణంగా సభలు, సమావేశాల ద్వారా ప్రజలకు చేరువవుతుంటారు. కానీ, కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత ఆత్మీయతకు ప్రాధాన్యమిచ్చి కుటుంబ సభ్యుడిగా మారిపోతుంటారు. తాజాగా అలాంటి ఘటనే తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంది. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక పార్టీ నాయకుడి కోరిక మేరకు కుటుంబ సభ్యురాలిగా మారి వివాహ వేడుకను దగ్గరుండి ఘనంగా జరిపించారు. ఈసీఐఎల్ కీసర క్రాస్ రోడ్డులోని ఆరాధ్య కన్వెన్షన్ ఈ వేడుకకు వేదికగా నిలిచింది.

Kavitha Wedding Ceremony | ఆచారం ప్రకారం ..

యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన బాషబోయిన బాలప్రసాద్ తెలంగాణ రక్షణ సేన నాయకుడిగా, తెలంగాణ జాగృతిలోనూ క్రియాశీలంగా పనిచేశారు. ఆయనకు సీతాఫల్ మండికి చెందిన శివానితో వివాహం నిశ్చయమైంది. బుధవారం ఉదయం ఈ వివాహ వేడుక జరగాల్సి ఉండగా, తనకు అక్కాచెల్లెళ్లు లేరని భావించిన బాలప్రసాద్ కోరిక మేరకు కవిత వారి ఇంటి ఆడబిడ్డలా వ్యవహరించారు.

ముదిరాజ్ కులాచారం ప్రకారం వరుడు వధువుకు తాళి కట్టే ముందు ఆడపడుచు పసుపు కొమ్ముతో మూడు ముళ్లు వేయాలి. ఈ సంప్రదాయం ప్రకారం కవిత గౌరీ పూజలో పాల్గొని, వధువు శివాని మెడలో పసుపు కొమ్ము దారంతో మూడు ముళ్లు వేశారు. అనంతరం వధువు ఉంగరపు వేలుకు ఉంగరం తొడిగి, ఒడిబియ్యం పోసి పెళ్లి కుమార్తెను మనసారా ఆశీర్వదించారు. ఆ తర్వాత వరుడు బాలప్రసాద్ శివాని మెడలో మంగళసూత్రం ధారణ చేశారు.

 

ఇది కూడా చదవండి: Model School Teachers | ప్రభుత్వ తీరుతో ఉపాధ్యాయుల ఇబ్బందులు : హరీశ్​రావు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *