Rudrapur Gang Rape | యూపీలో దారుణం.. 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం

ఉత్తరప్రదేశ్‌లోని రుద్రపూర్‌లో అత్యంత అమానుష ఘటన వెలుగు చూసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Rudrapur Gang Rape | ఉత్తరప్రదేశ్‌లోని రుద్రపూర్‌లో అత్యంత అమానుష ఘటన వెలుగు చూసింది. 19 సంవత్సరాల యువతిని అపహరించి ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించగా, నిందితులను పట్టుకునే క్రమంలో జరిగిన పరిణామాలు ఉద్రిక్తతకు దారితీశాయి.

Rudrapur Gang Rape | పోలీసులపై ఎదురుకాల్పులు..

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. గుర్బాజ్ (మను), జోగా సింగ్, రవీందర్ అనే ముగ్గురు నిందితులు ఆమెను అపహరించి, భూరారాణి రోడ్డు సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను విపరీతంగా కొట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. వారిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై నిందితులు ఎదురుకాల్పులకు దిగారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఒక నిందితుడి కాలికి గాయమైంది. చివరకు పోలీసులు సాహసించి ఆ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Rudrapur Gang Rape | పారిపోయే యత్నం..

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇద్దరు నిందితులను పోలీసులు ఘటనా స్థలానికి సీన్ రీక్రియేషన్ కోసం తీసుకువెళ్లారు. అక్కడ వారు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయేందుకు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు, స్థానికుల సహకారంతో వారిని వెంబడించి పట్టుకున్నారు. ఆగ్రహించిన స్థానికులు పట్టుబడిన చోటే వారికి దేహశుద్ధి చేసి, రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాష్ట్రంలో నేరాల నియంత్రణకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఇలాంటి అఘాయిత్యాలు వరుసగా వెలుగుచూస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Banswada MCH Protest | బాన్సువాడ ఎంసీహెచ్​లో వైద్య సిబ్బంది రెండో రోజూ నిరసన

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *