అక్షరటుడే వెబ్‌డెస్క్: Uttarakhand Eve Teasing | ఉత్తరాఖండ్‌లో యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పోకిరీలకు గ్రామస్తులు గట్టిగా బుద్ధి చెప్పారు. ముఖానికి ఇంకు పూసి, చెప్పులతో కొట్టడమే కాకుండా.. దురద పుట్టించే ఆకులతో వినూత్న రీతిలో దేహశుద్ధి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Uttarakhand Eve Teasing | అసభ్య ప్రవర్తన..
జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఉత్తరాఖండ్ నైనిటాల్ జిల్లా ముక్తేశ్వర్ పరిధిలోని సతోలి గ్రామంలో కొద్ది రోజులుగా కొందరు యువకులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. కారులో వచ్చిన ఐదుగురు యువకులు స్థానిక యువతులపై ఈవ్‌టీజింగ్, అసభ్యకర కామెంట్లు చేస్తూ వేధింపులకు దిగినట్లు ఆరోపణలు వచ్చాయి. శనివారం కూడా యువతులపై ఆ యువకులు అసభ్యకరంగా వ్యాఖ్యానించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళలు, గ్రామస్తులు వారిలో ఇద్దరిని పట్టుకున్నారు.
Uttarakhand Eve Teasing | దురద పుట్టించే మొక్కతో చితకబాదుడు..
పట్టుబడిన పోకిరీల ముఖాలపై ఇంకు పూసి, గ్రామస్తులు చెప్పులతో దేహశుద్ధి చేశారు. అంతటితో ఆగకుండా వారి చొక్కాలు విప్పించి ‘దురద గుంట ఆకు’ (Stinging nettle) అనే ప్రత్యేకమైన దురద పుట్టించే మొక్కతో చితకబాదారు. ఈ ఆకులపై ఉండే ముళ్లు చర్మానికి తగలగానే ‘హిస్టామిన్’ అనే రసాయనం విడుదలవుతుంది. దీనివల్ల తేలు కుట్టినట్లు విపరీతమైన మంట, దురద వస్తుంది. ఆ మంట తట్టుకోలేక ఆ పోకిరీలు విలవిల్లాడిపోయారు.
కారులో వెళ్తూ వేధించిన పోకిరీలు.. చితకబాదిన యువతులు
ఉత్తరాఖండ్ ముక్తేశ్వర్‌లోని సటోలి గ్రామంలో జరిగిన ఘటన
ఐదుగురు పోకిరీలు కారులో వెళ్తూ.. యువతులసై అసభ్యకరమైన కామెంట్స్
ఇది గమనించిన గ్రామస్థులు.. ఐదుగురిలో ఇద్దరు పోకిరీలను పట్టుకున్నారు
ఎవరిపై కామెంట్లు చేశారో.. ఆ యువతుల చేతే… pic.twitter.com/7jBtt4K0wp
— PulseNewsBreaking (@pulsenewsbreak) August 1, 2026
ఇది కూడా చదవండి: Bonalu Festival Funds | ఉత్సవాల నిర్వహణకు బిచ్చమెత్తుకునే దుస్థితి: బండి సంజయ్