Sriramsagar Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద పర్యాటకుల సందడి

శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​పై ఆదివారం పర్యాటకులు సందడి చేశారు.

shashi kiran Mottala

​అక్షరటుడే, మెండోరా: Sriramsagar Project | వర్షాల కారణంగా శ్రీరాంసాగర్​లోకి(SRSP) ప్రస్తుతం ఇన్​ఫ్లో ఆశాజనకంగా ఉంది. అయితే  ఆదివారం కావడంతో ప్రాజెక్ట్​పై పర్యాటకులు సందడి చేశారు.

 

Sriramsagar Project | మెండోరా మండలంలోని..

మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ (పోచంపాడ్​) (Pochampad Dam) ప్రాజెక్ట్ పర్యాటకులతో కిటకిటలాడింది. ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు ఉండడంతో ప్రకృతి అందాలను వీక్షించేందుకు జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. ​ప్రాజెక్టు పరిసరాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సందడి చేసిన పర్యాటకులు అందమైన దృశ్యాలను ఆస్వాదిస్తూ ఫొటోలు, సెల్ఫీలు దిగారు.

అప్రమత్తంగా పోలీసులు, ప్రాజెక్ట్​ సిబ్బంది..

​పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు, ప్రాజెక్టు భద్రతా సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించారు. డ్యామ్ దిగువ ప్రాంతాలకు ఎవరూ వెళ్లకుండా నిరోధిస్తూ, ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు. ​సందర్శకులు అధికారులు సూచించిన భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.

phto

ఇది కూడా చదవండి: Devi Sri Prasad as ‘PARSHI’ in… #YELLAMMA

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *