Nagesh Reddy | విద్యార్థులను రెచ్చగొట్టేలా మాట్లాడితే సహించేది లేదు..: నగేష్​రెడ్డి

విద్యార్థులను రెచ్చగొట్టేలా మాట్లాడితే సహించేది లేదని డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nagesh Reddy | విద్యార్థులను రెచ్చగొట్టేలా మాట్లాడితే సహించేది లేదని డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని కాంగ్రెస్​ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Nagesh Reddy | హామీలన్నీ నెరవేరుస్తాం..

ఎంపీ అర్వింద్​, ఎమ్మెల్యేలు గురువారం జరిగిన ‘విద్యార్థుల రణభేరి’లో సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy), ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారని నగేష్​ రెడ్డి అన్నారు. ప్రజలు మీ చేష్టలను గమనిస్తున్నారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను దిగమింగుకుని రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నప్పటికీ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత సీఎం రేవంత్​ రెడ్డిదేనన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో 65వేల నుంచి 70వేల వరకు ఉద్యోగాలు కల్పించామన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా అందిస్తున్నామన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ 5 లక్షల నుండి 10లక్షల వరకు పెంచామని స్పష్టం చేశారు.

Nagesh Reddy | చేసిన అభివృద్ధి కనిపించట్లేదా..?

ఈ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు బీజేపీ వాళ్లకు కంటికి కనిపించట్లేదా అని నగేష్​ రెడ్డి ప్రశ్నించారు. అదేవిధంగా సీఎం క్రీడల పట్ల ఎంతో ఆసక్తి ఉందని విద్యార్థులకు క్రీడలను ప్రోత్సహించే విధంగా కృషి చేస్తుంటే అభినందించాల్సింది పోయి పసలేని విమర్శలు చేస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిందని..ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఎన్ని ఉద్యోగాలు కల్పించారో వివరించాలన్నారు. నీట్ పేపర్ లీకేజీ అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రితో బాధ్యత రాజీనామా చేయించలేని వారు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు.

Nagesh Reddy | అడ్డగోలుగా పెరిగిన గ్యాస్​ ధరలు

Nagesh Reddy

పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెంచి సామాన్య జనాలపై ఆర్థిక భారం మోపుతున్నారని వీటిని డైవర్ట్​ చేయడానికి కొత్త నాటకాలు ఆడుతున్నారని బీజేపీ నాయకులను ఆయన విమర్శించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడ్తున్నారని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. ఆర్మూర్ నియోజకవర్గలోని ప్రతి గ్రామానికి పేదలకు 15 ఇళ్లు, 1 రూపాయికే వైద్యం అందిస్తానని చెప్పిన ఎమ్మెల్యే ఎంత మంది పేదలకు ఇళ్లు కట్టించారో చెప్పాలన్నారు. లేకపోతే ఆ ప్రజలే నీ ఇల్లు ముట్టడిస్తారన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టి దొంగతనం చేసేవిధంగా ప్రోత్సాహిస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసేవిధంగా అయన మాట్లాడుతున్నారని ఇలా మాట్లాడటం తెలంగాణకు నిజామాబాదు జిల్లాకు మంచిది కాదన్నారు.

‘రాకేష్ రెడ్డి మీ చరిత్ర అందరికి తెలుసు అని, మీరు మారారని ఆర్మూర్ ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే.. ఇష్టం వచ్చినట్లు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని’ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా ఎన్నికలలో మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్​ చేశారు. బీజేపీ నాయకులు వారి ఉనికిని కాపాడుకోవటానికి ఇలాంటి నిందలు, విమర్శలు చేస్తున్నారని విద్యార్థులు వాటిని నమ్మవద్దన్నారు. అర్వింద్ ఎంపీగా ఉంండి.. జిల్లాకు ఒక పరిశ్రమ ఐనా తీసుకువచ్చావా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తన మనువడి కోసం పూరీలు చేస్తే దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడుతున్నారన్నారు.

ఇది కూడా చదవండి..: Teacher Harassment | విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. ఇద్దరు ఒప్పంద ఉపాధ్యాయుల తొలగింపు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *