అక్షరటుడే, వెబ్డెస్క్: Bhagwant Mann Fine | పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు ఢిల్లీ ఎయిర్పోర్టు అధికారులు రూ.50 వేల జరిమానా విధించారు. మంగళవారం రాత్రి ఫ్రాన్స్ నుంచి తిరిగి వచ్చిన ఆయన కొన్ని విలాసవంతమైన వస్తువులు తీసుకురాగా.. వాటిపై కస్టమ్ డ్యూటీ వేశారు.
ముఖ్యమంత్రి తన సిబ్బందితో కలిసి గ్రీన్ ఛానల్ ద్వారా బయటకు వెళ్తుండగా విమానాశ్రయ అధికారులు తనిఖీ చేశారు. ఆయన కొన్ని విలాసవంతమైన వస్తువులను చెప్పకుండా తీసుకొచ్చినట్లు గుర్తించి ఫైన్ వేశారు. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను పంజాబీలకు అవమానంగా అభివర్ణించింది. రాత్రి పూట సీఎంను ఉద్దేశపూర్వకంగా మూడు గంటల పాటు నిర్బంధించారని పేర్కొంది.
Bhagwant Mann Fine | పర్యటన ఎందుకంటే..
అంతర్జాతీయ మార్కెట్లలో పంజాబ్ వ్యవసాయ, ఆహార శుద్ధి ఉత్పత్తులను ప్రోత్సహించడం, వాణిజ్య అవకాశాలను అన్వేషించడం కోసం సీఎం మాన్ ఫ్రాన్స్ వెళ్లారు. అయితే ఈ పర్యటనకు కేంద్రం మొదట అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన హైకోర్టును ఆదేశించారు. హైకోర్టు ఆదేశం మేరకు పారిస్‌కు వెళ్లారు. దీంతో తిరిగి వస్తుండగా.. ఆయనకు జరిమానా విధించడాన్ని కేంద్ర ప్రభుత్వ సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని ఆప్ నాయకులు విమర్శించారు. శిరోమణి అకాలీ దళ్ ప్రధాన కార్యదర్శి బిక్రమ్ సింగ్ మాట్లాడుతూ.. మాన్, అతని భార్య గుర్ప్రీత్ కౌర్ చట్టాలను ఉల్లంఘించినందుకు జరిమానా వేశారన్నారు.
ఇది కూడా చదవండి..: SBI Data Breach | ఎస్బీఐ ఖాతాదారుల వివరాలు హ్యాక్