SBI Data Breach | ఎస్​బీఐ ఖాతాదారుల వివరాలు హ్యాక్​

ఎస్​బీఐ ఖాతాదారులకు చెందిన వ్యక్తిగత వివరాలు డార్క్​ వెబ్​లో ప్రత్యక్షం అయ్యాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: SBI Data Breach | ఎస్​బీఐ ఖాతాదారుల వివరాలు హ్యాక్​ అయ్యాయి. 3,897 వినియోగదారుల వ్యక్తిగత వివరాలు డార్క్​ వెబ్​లో ప్రత్యక్షం అయ్యాయి. దీనిని బ్యాంక్​ సైతం ధ్రువీకరించింది.

దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్​ అయిన ఎస్​బీఐ (SBI)పై సైబర్​ దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. డార్క్ వెబ్‌లో వినియోగదారుల డేటా బహిర్గతమైనట్లు తమ థ్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రొవైడర్, డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ నుంచి అక్టోబర్ 16న హెచ్చరికలు అందినట్లు ఎస్‌బీఐ తెలిపింది. ప్రాథమిక విశ్లేషణలో సుమారు 375,000 రికార్డులను గుర్తించినట్లు బ్యాంక్ తెలిపింది. వీటిలో 3,897 వినియోగదారుల వ్యక్తిగత వివరాలు ఉండటం గమనార్హం.

SBI Data Breach | దర్యాప్తు చేపట్టిన బ్యాంక్​

ఖాతాదారుల మొబైల్ నంబర్లు, పుట్టిన తేదీలు, పేర్లు, ఈమెయిల్, చిరునామా, బ్యాంక్​ బ్రాంచ్, గుర్తింపు వివరాలు, లీడ్ ఐడీలు ఇతర వివరాలు లీక్​ అయ్యాయి. దీంతో కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ డేటా అంతా సైబర్​ నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఈ ఘటనపై ఎస్​బీఐ దర్యాప్తు చేపట్టింది. ప్రధాన కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగలేదని బ్యాంకు తెలిపింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

ఇది కూడా చదవండి..: Tiger Shroff | టైగర్​ ష్రాఫ్​పై హత్యాయత్నం.. గన్స్​ అందించిన మహిళలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *