అక్షరటుడే, వెబ్డెస్క్ : Padmavathi Ammavaru | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 6 నుంచి 14 వరకు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ప్రతి ఏటా తొమ్మిది రోజుల పాటు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో డిసెంబర్ 1న ఆలయ శుద్ధి కోసం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. 5న లక్ష కుంకుమార్చన, అంకురార్పణ కార్యక్రమాలు చేపడుతారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. 6న అమ్మవారు చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారు. 7న పెద్దశేష వాహనం, హంస వాహనం, 8న ముత్యపుపందిరి వాహనం, సింహ వాహనం, 09న కల్పవృక్ష వాహనం, హనుమంత వాహన సేవలు నిర్వహిస్తారు.
Padmavathi Ammavaru | 13న రథోత్సవం
డిసెంబర్ 10న పల్లకీ ఉత్సవం, గజ వాహనం, 11న సర్వభూపాల వాహనం స్వర్ణరథం, గరుడ వాహనం, 12న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, 13న రథోత్సవం, 14న పంచమీ తీర్థం ధ్వజావరోహణం, 15న పుష్పయాగం నిర్వహించనున్నారు. డిసెంబర్ 01న ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు, కుంకుమార్చన, బ్రేక్ దర్శనం రద్దు చేశారు. డిసెంబర్ 5 నుంచి 16 వరకు అన్ని ఆర్జిత సేవలు, కుంకుమార్చన, వేదాశీర్వచనం, బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ (TTD) అధికారులు తెలిపారు.
దీనిని కూడా చదవండి : ACB Trap | ఏసీబీకి చిక్కిన ఏఈ, హెల్త్ ఇన్స్పెక్టర్