Osman Sagar Water Supply | ఉస్మాన్‌సాగర్ నుంచి అదనంగా తాగునీటి సరఫరాకు ప్రణాళికలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Osman Sagar Water Supply | భవిష్యత్తు తాగునీటి అవసరాలు, రహదారి విస్తరణకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి సూచించారు. శనివారం హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) ఎండీ ఉపేందర్ రెడ్డితో కలిసి ఎంజీఐటీ నుంచి పుప్పాలగూడ బీఆర్సీ వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఇరు సంస్థల ఎండీలు, ఉన్నతాధికారులు సుమారు ఆరు కిలోమీటర్ల మేర కాలినడకన పర్యటించి పైపులైన్ల అలైన్‌మెంట్‌ను పరిశీలించారు. నిర్మాణపరమైన అడ్డంకులు, సాంకేతిక సమస్యలు, భూసేకరణ, అనుమతులు తదితర అంశాలను ప్రత్యక్షంగా గుర్తించి, పరిష్కార మార్గాలపై అక్కడికక్కడే చర్చించారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, భవిష్యత్తు అవసరాలను పరిగణనలోకి తీసుకుని పది కిలోమీటర్ల మేర పైపులైన్ల ఏర్పాటుకు సమగ్ర డిజైన్ రూపొందించాలని ఎండీ ఆదేశించారు. రహదారుల తవ్వకాలను సాధ్యమైనంత వరకు నివారిస్తూ కండ్యూట్ లేదా బండ్ వెంబడి పైపులైన్ల ఏర్పాటుకు సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు.

Osman Sagar Water Supply | షేక్‌పేట్‌లో..

ఉస్మాన్‌సాగర్ (గండిపేట) జలాశయం నుంచి అదనంగా 21 ఎంజీడీల నీటిని సమీకరించేందుకు జలమండలి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా షేక్‌పేట్ ఫిల్టర్ బెడ్స్‌లో 21 ఎంజీడీల సామర్థ్యంతో నూతన నీటి శుద్ధి కేంద్రం (డబ్ల్యూటీపీ) నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను ఎండీ సమీక్షించారు. ఉస్మాన్‌సాగర్ జలవనరులను సమర్థంగా వినియోగించుకుంటూ అదనపు నీటిని శుద్ధి చేసి సమీప ప్రాంతాలకు సరఫరా చేసేందుకు అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని సూచించారు. వేసవిలో నగరంలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

దీనిని కూడా చదవండి : DGP CV Anand Nizamabad | పోలీసులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం..: డీజీపీ సీవీ ఆనంద్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *