ACB DA Case | 12 ప్లాట్లు, 4 ఇళ్లు.. మెప్మా అదనపు డైరెక్టర్​ అక్రమాస్తులు

మెప్మా అదనపు డైరెక్టర్ నల్లగుంట్ల యాదగిరి రావు నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : ACB DA Case | మెప్మా (మున్సిపల్ ప్రాంతాలలో పేదరిక నిర్మూలన మిషన్) అదనపు డైరెక్టర్ నల్లగుంట్ల యాదగిరి రావుపై ఏసీబీ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. మంగళవారం ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించింది. అతడి అక్రమాస్తులను చూసి ఏసీబీ అధికారులే విస్తు పోయారు.

యాదగిరి రావు అవినీతి పద్ధతులు, అనుమానాస్పద మార్గాల ద్వారా ఆస్తులు సంపాదించినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి మంగళవారం ఉదయం అతడి ఇల్లు, కార్యాలయం, బ్యాంకు లాకర్లు, బంధువులు, సహచరులు, బినామీదార్లకు చెందిన ఇతర ప్రదేశాలతో సహా 10 చోట్ల ప్రాథమిక సోదాలు నిర్వహించారు.

ACB DA Case | ఆస్తులు చిట్టా

అదనపు డైరెక్టర్​ యాదగిరి రావుకు హైదరాబాద్, సూర్యాపేటలో వివిధ ప్రదేశాలలో 12 ప్లాట్లు న్నాయి. నగరంలోని ఉప్పల్‌లో ఉన్న రెండు నివాస ఫ్లాట్లు, ఒక నివాస భవనం (G+3) సూర్యాపేట జిల్లాలో ఇల్లు, ఉప్పల్‌లో ఉన్న ఒక వాణిజ్య దుకాణం ఉంది. అతడి నివాసాల్లో 1,792.2 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. వివిధ ఖాతాలలో రూ. 32,30,000/- బ్యాంకు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. అతడి మొత్తం ఆస్తుల విలువ రూ.4.75 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే బహిరంగ మార్కెట్​లో వీటి విలువ రూ.50 కోట్ల కంటే అధికంగా ఉంటుందని అంచనా. అదనపు డైరెక్టర్​ యాదగిరి రావును అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Boy Murder Case | బాలుడి హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *