Sharannavaratri Celebrations | ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు.. మిగిలింది నిమజ్జన కార్యక్రమమే..

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Sharannavaratri Celebrations | కామారెడ్డి (kamareddy) జిల్లా వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. 9 రోజుల పాటు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చిన దుర్గామాతకు  మంగళవారం ఉద్వాసన పూజలు నిర్వహించారు.

Sharannavaratri Celebrations | రాజరాజేశ్వరి అవతారంలో..

10వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి ఉద్వాసన పలికారు. జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద, జుక్కల్ నియోజవర్గాల్లోని పలు మండలాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాల వద్ద 9 రోజులు భక్తుల రద్దీ నెలకొంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, కుంకుమార్చన, చండీ హోమాలు నిర్వహించారు. మహిళలు బతుకమ్మ, కోలాటం ఆడుతూ అమ్మవారికి నీరాజనాలు పలికారు. యువకులు డీజే సౌండ్, డాన్సులతో ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈసారి దసరా ప్రత్యేక అలంకారంలో అమ్మవారు 10 రోజులు 10 అవతారాల్లో దర్శనమిచ్చారు. మొదటి రోజు శ్రీ బాలాత్రిపుర సుందరి దేవిగా, రెండో రోజు శ్రీ గాయత్రి దేవిగా, మూడో రోజు శ్రీ అన్నపూర్ణ దేవిగా, నాలుగో రోజు శ్రీ మహాచండి దేవిగా, ఐదో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా, ఆరో రోజు శ్రీ సరస్వతి దేవిగా, ఏడో రోజు శ్రీ మహాలక్ష్మి దేవిగా, ఎనిమిదో రోజు శ్రీ దుర్గా దేవిగా, తొమ్మిదో రోజు శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా, పదో రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిచ్చారు. పదో రోజు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి ఉద్వాసన పలికారు.

Sharannavaratri Celebrations | ఇక మిగిలింది నిమజ్జనమే

ఉద్వాసన పలికిన అమ్మవారి విగ్రహాలను బుధవారం నుంచి నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కామారెడ్డి పట్టణంలోని చెరువు, బాన్సువాడలోని నల్లవాగు, ఎల్లారెడ్డి చెరువుల వద్ద నిమజ్జనం కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేశారు. మరికొందరు నేరుగా బాసర వద్ద నిమజ్జనం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నిమజ్జన ఊరేగింపుల్లో డిజేలకు పోలీసులు అనుమతులు నిరాకరించారు. దాంతో గణేష్ ఉత్సవాలు మాదిరిగానే డోలు, డప్పులతో అమ్మవారికి వీడ్కోలు పలకనున్నారు.

ఇది కూడా చదవండి: 10,000mAh బ్యాటరీతో వివో కొత్త 5G ఫోన్! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *