ACB Trap | ఏసీబీకి చిక్కిన ఏఈ, హెల్త్ ఇన్​స్పెక్టర్​

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్​ ఏఈ, హెల్త్​ ఇన్​స్పెక్టర్​ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | సంగారెడ్డి (Sangareddy) జిల్లా సదాశివపేట పురపాలక సంఘానికి చెందిన అసిస్టెంట్ ఇంజనీర్, పబ్లిక్ హెల్త్ అండ్ వర్క్ ఇన్‌స్పెక్టర్ (అవుట్ సోర్సింగ్) ఏసీబీకి చిక్కారు. బిల్లులు చెల్లించేందుకు లంచం తీసుకుంటుండగా వారిని అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

ACB Trap | రూ.15 వేలు తీసుకుంటూ..

సదాశివపేట (Sadashivpeta) మున్సిపాలిటీ పబ్లిక్​ హెల్త్​ విభాగంలో అసిస్టెంట్​ ఇంజినీర్​గా ఏ రాజేశ్​, హెల్త్​ అండ్​ వర్క్​ ఇన్​స్పెక్టర్​గా శివరెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. 2025 గణేష్ నిమజ్జన కార్యక్రమం కోసం సంగారెడ్డి పట్టణంలోని ఉబా చెరువులో చేపట్టే పూడికతీత పనులకు సంబంధించి రూ. 4.50 లక్షల విలువైన కాంట్రాక్ట్ బిల్లును మంజూరు చేసి, ప్రాసెస్​ చేసినందుకు వీరు కాంట్రాక్టర్​ నుంచి లంచం డిమాండ్​ చేశారు. రూ.15 ఇవ్వాలని అడిగారు. దీంతో సదరు కాంట్రాక్టర్​ ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా.. ఇద్దరు ఉద్యోగులను ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. అనంతరం ఇద్దరిని అరెస్ట్​ చేశారు.

దీనిని కూడా చదవండి : Kejriwal Sheesh Mahal | కేజ్రీవాల్ ‘శీష్ మహల్’లో.. రూ.11 లక్షల షాండిలియర్.. రూ.5 లక్షల సోఫా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *