Hindware Brand Store | విశాఖపట్నంలో హింద్‌వేర్ నూతన బ్రాండ్ స్టోర్ ప్రారంభం.. ఏపీలో 13కు చేరిన స్టోర్ల సంఖ్య..

ప్రముఖ బాత్‌వేర్ బ్రాండ్ హింద్‌వేర్ (Hindware) దక్షిణ భారతదేశంలో తన రిటైల్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Hindware Brand Store | ప్రముఖ బాత్‌వేర్ బ్రాండ్ హింద్‌వేర్ (Hindware) దక్షిణ భారతదేశంలో తన రిటైల్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నూతన ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ స్టోర్‌ను ప్రారంభించింది. నగరంలోని వంటిల్లు జంక్షన్ సమీపంలో నాయుడు పీవీసీ సెంటర్ నిర్వహణలో ఏర్పాటైన ఈ ఫ్లాగ్‌షిప్ స్టోర్ ద్వారా స్థానిక వినియోగదారులకు హింద్‌వేర్ ఉత్పత్తులు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రారంభంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హింద్‌వేర్ బ్రాండ్ స్టోర్ల సంఖ్య 13కు చేరింది.

Hindware Brand Store | విభిన్న బాత్‌వేర్ ఉత్పత్తులు..

ఈ నూతన స్టోర్‌లో హింద్‌వేర్‌కు చెందిన వివిధ బ్రాండ్ల ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. వినియోగదారులు, ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్లు ఒకే చోట విభిన్న శ్రేణి బాత్‌వేర్ ఉత్పత్తులు, ఆధునిక డిజైన్లు, ఫినిషింగ్‌లు, ఫీచర్లను పరిశీలించేందుకు వీలుగా దీనిని తీర్చిదిద్దారు. వాణిజ్య, పారిశ్రామిక కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో విస్తరిస్తున్న పట్టణీకరణ నేపథ్యంలో ఆధునిక బాత్‌రూమ్ ఉత్పత్తులకు పెరుగుతున్న గిరాకీని ఈ స్టోర్ తీర్చనుంది.

వృద్ధి చెందుతున్న మార్కెట్లపై దృష్టి: సీఈఓ నిరుపమ్ సహాయ్
స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా హింద్‌వేర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) నిరుపమ్ సహాయ్ మాట్లాడుతూ.. విశాఖపట్నం తమకు అత్యంత కీలకమైన, వేగంగా ఎదుగుతున్న మార్కెట్ అని పేర్కొన్నారు. ప్రధాన మెట్రో నగరాల్లో కార్యకలాపాలను బలోపేతం చేస్తూనే, వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉన్న మార్కెట్లలో తమ ఉనికిని విస్తరించే వ్యూహంలో భాగంగా ఈ స్టోర్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. రిటైల్ నెట్‌వర్క్ విస్తరణ ద్వారా వినియోగదారులకు తమ ఉత్పత్తులను మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని వివరించారు.

Hindware Brand Store | దేశవ్యాప్తంగా విస్తృత నెట్‌వర్క్..

భారతదేశం ( India ) అంతటా హింద్‌వేర్ బలమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం దేశంలోని 700కు పైగా జిల్లాల్లో 35,000కు పైగా యాక్టివ్ రిటైల్ టచ్‌పాయింట్లు, 500కు పైగా డిస్ట్రిబ్యూటర్లు, 575కు పైగా బ్రాండ్ స్టోర్లతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అలాగే 70 జిల్లాల్లో 1,090 మందికి పైగా టెక్నీషియన్లతో కూడిన ఆఫ్టర్-సేల్స్ సర్వీస్ నెట్‌వర్క్ ద్వారా మెట్రో నగరాల్లో 24 గంటల్లో, నాన్-మెట్రో ప్రాంతాల్లో 48 గంటల్లో వేగవంతమైన సేవలను అందిస్తోంది.

ఇది కూడా చదవండి:  SAP Job Cuts | AI దెబ్బ.. SAPలో 10 వేల ఉద్యోగాల కోత..!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *