అక్షరటుడే వెబ్‌డెస్క్: Drug Free Telangana | అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఈ పోరాటంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.
Drug Free Telangana | కుటుంబాల విచ్ఛిన్నం..
మాదకద్రవ్యాల వినియోగం కేవలం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా, వారిపై ఆధారపడిన కుటుంబాలను కూడా సర్వనాశనం చేస్తుందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ సంస్కృతి పెరగడం వల్ల సమాజంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని, ఇది సామాజిక జీవనాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. యువతలో నైతిక విలువలు, సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం ద్వారానే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమని ఆయన పేర్కొన్నారు.
Drug Free Telangana | డ్రగ్ ఫ్రీ తెలంగాణ..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘డ్రగ్ ఫ్రీ తెలంగాణ’ లక్ష్యాన్ని చేరుకోవడానికి యువత, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, సమాజంలో విస్తృత అవగాహన కల్పించడం ద్వారానే ఈ మహమ్మారిని జయించగలమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇది కూడా చదవండి: Yogi Adityanath | కాంగ్రెస్ దేశాన్ని ముక్కలు చేసింది : యూపీ సీఎం ఆదిత్యానాథ్