అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sai Krishna Lockup Death | సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. విజయవాడ (Vijayawada)లోని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే సీఐ నాగరాజ్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. నాగరాజు డెడ్‌బాడీ మాయం చేయడానికి సీఐకి మరో ఇద్దరు కానిస్టేబుళ్లు సహకరించినట్లు సిట్ గుర్తించింది.
ఇద్దరు కానిస్టేబుళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కొన్నిరోజులుగా ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని సెలవులో ఉన్నారు. తన కుమారుడి హత్యలో సీఐ నాగరాజుతో మరికొందరి పాత్ర ఉన్నట్లు సిట్‌కు సాయికృష్ణ తల్లి తెలిపారు. దీంతో పరారీలో ఉన్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ల ఫోన్ సిగ్నల్స్‌ను సిట్ అధికారులు ట్రాక్ చేస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ అశోక్ సీఐ అసిస్టెంట్‌గా ఉన్నాడు. ఆయన ఇంటికి సిట్ అధికారులు వెళ్లారు. అయితే ఇంట్లో అతడు లేకపోవడంతో వెనుతిరిగారు.
Sai Krishna Lockup Death | అజ్ఞాతంలోకి.
సాయికృష్ణ మృతదేహాన్ని ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్, సీఐ స్నేహితుడు మాయం చేసినట్లు సిట్ విచారణలో తేలింది. సీఐ నాగరాజు అరెస్ట్ కాగానే హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, జంగం నాని, సీఐ స్నేహితుడు సురేష్ పారిపోయారు. సీఐ పేరు చెప్పుకుంటూ ప్రైవేట్ వ్యవహరాలు నడపడంలో హెడ్ కానిస్టేబుల్ నాని కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. నాని గతంలో గన్నవరంలో సస్పెండ్ అయ్యాడు. ఇటీవల కృష్ణలంక (Krishnalanka)లో హెడ్ కానిస్టేబుల్‌గా పోస్టింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి..: Kethireddy Dharna | కేతిరెడ్డి ధర్నా.. తాడిపత్రిలో ఉద్రిక్తత