అక్షరటుడే వెబ్‌డెస్క్: Raptadu School Attack |అనంతపురం జిల్లా ( Anantapur ) రాప్తాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (ZPHS) శనివారం అమానుష ఘటన చోటుచేసుకుంది. స్కూల్ ప్రాంగణంలోకి చొరబడిన ఇద్దరు ఉన్మాదులు.. క్లాస్‌రూమ్‌లోనే పదో తరగతి చదువుతున్న గోపిక అనే విద్యార్థినిపై చెట్లు నరికే ఎలక్ట్రిక్ రంపంతో (ట్రీ కట్టర్) విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు.
Raptadu School Attack | కుడిచేయి తెగిపోయి..
ఈ కిరాతక దాడిలో విద్యార్థిని గోపిక కుడిచేయి తెగిపోవడంతో పాటు తల, ముఖం, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన లక్ష్మి అనే మరో విద్యార్థినికి కూడా గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో స్పృహ కోల్పోయిన బాలికలను ఉపాధ్యాయులు, స్థానికులు వెంటనే అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గోపిక పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టగా.. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Raptadu School Attack | సీఎం చంద్రబాబు ఆగ్రహం..
రాప్తాడు పాఠశాలలో జరిగిన ఈ దారుణ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడిన సీఎం.. నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. బాధితురాలైన బాలికకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఆసుపత్రి వర్గాలను, పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు.
Raptadu School Attack | కన్నీళ్లు ఆగడం లేదు..
ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “చిన్నారిని క్లాస్‌రూమ్‌లో నెత్తుటి మడుగులో చూశాక కన్నీళ్లు ఆగడం లేదు.. గుండె బరువెక్కింది. ఇలాంటి ఉన్మాదులను ఉక్కుపాదంతో అణిచేస్తాం. ఏపీలో ఆడపిల్లలు, మహిళల వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా కఠిన చర్యలు ఉంటాయి. పిల్లల భద్రత పట్ల నిర్లక్ష్యం వహించేవారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు” అంటూ ఆయన గట్టిగా హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Kamareddy Open Plots | వెంచర్లలో ‘ఓపెన్ స్థలాల’ దందా.. పట్టించుకోని బల్దియా