అక్షరటుడే వెబ్‌డెస్క్: Trump Iran Deal | ఇరాన్‌తో కుదిరిన ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump )చేసిన తాజా ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. విదేశాల్లో నిలిచిపోయిన ఇరాన్ ఆస్తులను విడుదల చేస్తామని చెబుతూనే, ఆ నిధులను కేవలం అమెరికా నుంచి ఆహార ధాన్యాల కొనుగోలుకే వాడాలని ట్రంప్ విధించిన షరతు తీవ్ర వివాదానికి దారితీసింది.
Trump Iran Deal | ట్రంప్ ప్లాన్ ఇదే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇరాన్ ఆస్తులను విడిపించే ప్రక్రియలో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిధులను ఇరాన్‌లోని ఆకలి సమస్య తీర్చడానికి అమెరికా రైతుల నుంచి మొక్కజొన్న, గోధుమల కొనుగోలుకు మళ్లిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌కు నేరుగా నగదు అందకుండా, ఈ మార్గం ద్వారా అమెరికా రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ చర్య ఇరాన్ ప్రజలకు ఆహార భద్రతను కూడా కల్పిస్తుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
Trump Iran Deal | ఇరాన్ ఆగ్రహం..
ట్రంప్ చేసిన ఈ ప్రకటనను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబాఫ్ స్పందిస్తూ, తాము కుదుర్చుకున్న ఒప్పందంలో అమెరికా వస్తువులను కొనుగోలు చేయాలనే నిబంధన ఎక్కడా లేదని స్పష్టం చేశారు. తమ ఆస్తులను ఎటువంటి షరతులు లేకుండా విడుదల చేయాలని ఒప్పందంలో స్పష్టంగా ఉందని ఆయన గుర్తుచేశారు. ట్రంప్ చేస్తున్న ఇలాంటి ప్రకటనలు అమెరికా దౌత్యపరమైన వైఫల్యానికి నిదర్శనమని ఘాలిబాఫ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఇది కూడా చదవండి: Sai Krishna Lockup Death | సాయికృష్ణ లాకప్‌డెత్.. డెడ్‌బాడీని మాయం చేసింది వారే..