Divya Mittal Politics | ఐఏఎస్‌ వదిలి.. పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మాజీ లేడీ కలెక్టర్

ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ప్రముఖ మాజీ ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ రాజకీయ రంగప్రవేశం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Divya Mittal Politics | ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ప్రముఖ మాజీ ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ రాజకీయ రంగప్రవేశం చేశారు. తన 13 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్‌కు గత నెలలో రాజీనామా చేసిన ఆమె, తన భవిష్యత్ రాజకీయ ప్రయాణంపై స్పష్టతనిచ్చారు. యూపీ వేదికగా ప్రజా సేవలో కొనసాగనున్నట్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ వీడియో విడుదల చేస్తూ అధికారికంగా ప్రకటించారు. అయితే తాను ప్రస్తుతానికి ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని స్పష్టం చేశారు.

Divya Mittal Politics | పాలనా అనుభవమే ..

ఉత్తరప్రదేశ్ తనకు ఖర్మభూమి అని, ఈ రాష్ట్రమే తన రాజకీయ ప్రయాణానికి ఆరంభ స్థానమని దివ్య మిట్టల్ పేర్కొన్నారు. పదవిలో ఉన్న సమయంలో నిధులు, అనుమతులు, స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ సామాన్యుల సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదో తాను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. ప్రభుత్వానికి సాధారణ ప్రజల గొంతు సరిగా చేరకపోవడం, చేరినా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడాన్ని గమనించానని, అలాంటి వారి తరఫున నిలబడేందుకే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

Divya Mittal Politics | ప్రత్యేక గుర్తింపు..

2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్‌ అయిన దివ్య మిట్టల్, గత ఆగస్టు 30న తన 13 ఏళ్ల కెరీర్‌ను ముగిస్తూ రాజీనామా చేశారు. తాను పదవిని వీడుతున్నప్పటికీ సేవ చేయాలనే కల మాత్రం కొనసాగుతుందని పేర్కొన్నారు. తన సర్వీస్ కాలంలో మిర్జాపూర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన కాలం ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. అక్కడ మారుమూల కొండ ప్రాంతంలోని లహురియా దేహ్ గ్రామానికి ఎన్నో ఏళ్లుగా లేని తాగునీటి సౌకర్యాన్ని కల్పించి ప్రజల మన్ననలు పొందారు.

Divya Mittal Politics | ఆసక్తికర పరిణామం..

సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న దివ్య మిట్టల్ అనూహ్యంగా ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. యూపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమె ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏ పార్టీలోనూ చేరకుండా ఆమె రాజకీయ ప్రయాణాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.


ఇది కూడా చదవండి:  Kamareddy Road Repairs | కామారెడ్డిలో రోడ్ల పునరుద్ధరణకు నిధులు విడుదల

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *