Supreme Court | సంభాల్​ హింసాకాండ.. నిందితుడి నిర్బంధంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

సంభాల్​ హింసాకాండ కేసులో ఎన్​ఎస్​ఏ చట్టం కింద నిందితుడి నిర్బంధాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Supreme Court | సంభాల్​ హింసాకాండ కేసులో ఎన్​ఎస్​ఏ చట్టం కింద నిందితుడిని నిర్భందించారు. దీనిని మంగళవారం సుప్రీంకోర్టు రద్దు చేసింది.

ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)​లోని సంభాల్​లో షాహీ జామా మసీదు సర్వే నేపథ్యంలో 2024 నవంబర్​ 24న హింస చెలరేగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 20 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన సూత్రధారిగా ముల్లా అఫ్రోజ్​ను గుర్తించారు. అతడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడికి అలహాబాద్​ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో యూపీ ప్రభుత్వం అఫ్రోజ్​ను 2025 అక్టోబర్​లో కఠినమైన ఎన్​ఎస్​ఏ చట్టం కింద అరెస్ట్ చేసింది.

Supreme Court | యూపీ ప్రభుత్వానికి ఫైన్​

యూపీ ప్రభుత్వంపై అఫ్రోజ్​ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్​పై విచారణ చేపట్టింది. నిందితుడి నేరాంగీకార వాంగ్మూలం ఆధారంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు నిర్బంధ ఉత్తర్వులు జారీ చేయలేదని పేర్కొంది. చట్టవిరుద్ధమైన నిర్బంధ ఉత్తర్వును జారీ చేసినందుకు ప్రభుత్వంపై రూ. 10 లక్షల జరిమానా విధించింది. ఎన్​ఎస్​ఏ కింద అఫ్రోజ్ నిర్బంధాన్ని సమర్థిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.

ఇది కూడా చదవండి..: Divya Mittal Politics | ఐఏఎస్‌ వదిలి.. పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మాజీ లేడీ కలెక్టర్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *